Site icon NTV Telugu

Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి ప్రాంక్స్, జిమ్ని లాంచ్ వివరాలు ఇవే..

Maruti Suzuki Fronx, Jimny

Maruti Suzuki Fronx, Jimny

Maruti Suzuki Fronx, Jimny launch details: ఇండియాలో అతిపెద్ద కార్ మేకర్ గా ఉన్న మారుతి సుజుకీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రాంక్స్, జమ్నీ కార్లు రాబోతున్నాయి. వీటికి జనాల్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ రెండు ఎస్ యూ వీలను మారుతి 2023 ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది. అయితే ఇప్పటికే ఈ కార్లకు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కానీ ఇవి ఎప్పుడు లాంచ్ కాబోతున్నాయనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.

మారుతి సుజుకి ప్రాంక్స్ ను ఏప్రిల్ రెండో వారంలో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయబోతున్నారు. ఇక దీని తర్వాత జిమ్నీని కొద్ది రోజలు వ్యవధిలో లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జనవరి 12 నుంచి ఈ రెండు కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు ప్రాంక్స్ కు 15,500 బుకింగ్స్ రాగా అంటే రోజుకు సగటున 218 కార్లు బుక్ అవుతున్నాయి. ఇక ఆఫ్ రోడ్ కార్ గా మహీంద్రా థార్ కు పోటీదారుగా మారుతి తీసుకువచ్చిన జిమ్నికి కూడా భారీ బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 23,500 జిమ్ని బుకింగ్స్ అయ్యాయి. రోజుకు సగటున 331 బుకింగ్స్ వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Read Also: Donald Trump: నన్ను టచ్ చేస్తే విధ్వంసమే.. ట్రంప్ వార్నింగ్..

మారుతి సుజుకీ ప్రాంక్స్ ధర రూ. 6.75 లక్షల నుండి రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండొచ్చు. జిమ్నీ ధర రూ. 9 లక్షల నుండి రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా మరియు ఆల్ఫా వంటి 5 వేరియంట్లలో ప్రాంక్స్ లభ్యం అవుతుండగా.. జిమ్నీ జీటా, ఆల్ఫా వేరియంట్లలో రాబోతోంది.

ప్రాంక్స్ రెండు ఇంజిన్ ఆఫ్షన్లతో రాబోతోంది. K12N 1.2-లీటర్ Dual-Jet Dual-VVT పెట్రోల్ ఇంజన్ 90 పీఎస్ 113 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక K10C 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ వేరియంట్ 100 పీఎస్ పవర్ 134 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. K12N ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువర్, ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో, K10C ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ లో రానుంది.

జిమ్నీలో 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ తో రాబోతోంది. ఇది 103 పీఎస్ పవర్, 134 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో రాబోతోంది. ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో జిమ్నీ మార్కెట్ లోకి రాబోతోంది.

Exit mobile version