Maruti Suzuki e Vitara: మారుతి సుజుకీ e-విటారా లాంచ్.. రూ. 10.99 లక్షల ప్రారంభ ధర..
- ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి మారుతి సుజుకీ ఎంట్రీ..
- మారుతి సుజుకీ e విటారా లాంచ్.. రూ. 10.99 లక్షల ప్రారంభ ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ఈ విటారా(Maruti Suzuki e Vitara ) భారత మార్కెట్లో లాంచ్ అయింది. మారుతి సుజుకి ఇండియా తన తన మొదటి ఎలక్ట్రిక్ కార్‌ను తీసుకువచ్చింది. ఈ విటారా ఇండియన్ మార్కెట్లో రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిచయ ప్రారంభ ధరతో బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ మోడల్‌తో కి.మీకి రూ. 3.99 బ్యాటరీ EMIతో లాంచ్ చేసింది. అంటే, బ్యాటరీని కొనుగోలు చేయకుండా, ఉపయోగించిన కిలోమీటర్లకు ఛార్జ్ చెల్లించే విధానాన్ని తీసుకువచ్చింది.
ఈ ధర మార్చ్ 31 వరకు చెల్లుబాటు అవుతుంది. దీంతో ఇది ధరల పరంగా మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ SUVలతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ విండ్సర్, మహీంద్రా BE6, విన్‌ఫాస్ట్ VF6 వంటి ప్రత్యర్థి కార్లకు ఇది పోటీని ఇస్తుంది. బుకింగ్ విషయానికి వస్తే రూ. 21,000లతో ఈ కార్‌ను బుక్ చేసుకోవచ్చు. వాహనం+బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ ఇస్తున్నారు. 1 ఏడాది ఉచిత ఛార్జింగ్ సౌకర్యాన్ని ఇవ్వడంతో పాటు రూ. 50,000 విలువైన హోమ్ ఛార్జర్ ఇన్స్టలేషన్ ఉచితంగా ఇస్తుంది.
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
మోటార్ -పవర్:
మోటార్, పవర్ విషయానికి వస్తే ఈ కారు హార్టెక్ట్-ఇ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైంది. ఇందుల్లో eAxlesను ఉపయోగించారు. ఇది మోటార్, ఇన్వర్టర్ను ఒకే యూనిట్‌గా అనుసంధానిస్తుంది. మారుతి సుజుకి ఈ విటారా 49 kWh , 61 kWh రెండు బ్యాటరీ ప్యాక్స్‌లో లభ్యమవుతుంది. ఇవి 440 కి.మీ, 543 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. చిన్న బ్యాటరీ ప్యాక్ 144 బీహెచ్పీ, 189 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తే, పెద్ద బ్యాటరీ 174 బీహెచ్పీ, 189 ఎన్ఎం శక్తిని జనరేట్ చేస్తుంది. ఇది సెట్ టూ ప్యాక్ టెక్నాలజీని కలిగి ఉంది, -30°C నుంచి 60°C వరకు ఆపరేట్ అయ్యేలా రూపొందించారు.
డిజైన్, సేఫ్టీ, ఫీచర్లు:
మారుతి ఇ-విటారాలో ట్రై-LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్ ఉన్నాయి. ఏరోడైనమిక్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇది 4,275 mm పొడవు, 1,800 mm వెడల్పు, 1,640 mm హైట్, 2,700 mm వీల్ బేస్ కలిగి ఉంది. ఎకో, నార్మల్, స్పోర్ట్స్, స్నో డ్రైవింగ్ మోడ్లు కార్లో ఉన్నాయి. రిజెనరేటివ్ బ్రేకింగ్‌తో వన్ పెడల్ డ్రైవింగ్ ఉంది.
ఇంటీరియర్స్‌లో ప్రీమియం క్యాబిన్, ట్విన్ డాష్ లేఅవుట్, 10.1-inch ఇన్ఫోటైన్మెంట్, 10.25-inch డిజిటల్ క్లస్టర్, వైర్లెస్ కనెక్టివిటీ, హార్మన్ సౌండ్ సిస్టమ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లతో పాటు లెవల్ -2 ADAS, 7 ఎయిర్ బ్యాగ్స్ కలిగి ఉంది. అడ్వాన్స్డ్ బ్యాటరీ ప్రొటెక్షన్, ఆల్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్(ఈపీబీ) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..