Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..

  • మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా..?
  • ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది, మరింత పవర్, ధర తక్కువకే..
Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.? అయితే మరికొన్ని రోజులు ఆగితే బెటర్. ఎందుకంటే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. ఇప్పటికే ఈ కార్‌కు సంబంధించిన స్పై షాట్స్ వైరల్ అయ్యాయి. రాబోతున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో భారీ అప్‌డేట్స్ ఉండబోతున్నాయి. దీంతో, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే వారు మరికొన్ని రోజులు ఆగితే బెటర్ అని తెలుస్తోంది.

మరింత పవర్:

కొత్తగా వచ్చే బ్రెజ్జాలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌‌తో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బ్రెజ్జాలో 5-స్పీడ్ మాన్యువల్ సెటప్‌తో ఉంది. ఒక వేళ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తే హైవేలో స్మూత్ డ్రైవింగ్, ఫ్యూయల్ మైలేజ్ పెరుగుతుంది. ఇంజన్ సౌండ్ తగ్గుతుంది. ఇదే కాకుండా రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు బ్రెజ్జాలో టర్బో ఇంజన్ లేదు. టర్బో ఇంజన్ వస్తే కార్ పవర్ పెరుగుతుంది. ఫన్ టూ డ్రైవ్ కోరుకునే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయంలో నెక్సాన్, వెన్యూ, సోనెట్‌లకు పోటీ ఇవ్వగలదు. ప్రస్తుతం బ్రెజ్జా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే వస్తోంది.

ధర తగ్గే అవకాశం:

ఇదే కాకుండా.. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ బ్రెజ్జా 1.2 సీసీ కంటే తక్కువ. దీంతో జీఎస్టీ తగ్గే అవకాశం ఉంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తే, బ్రెజ్జా కార్ సబ్-4 మీటర్ కేటగిరీలోకి వస్తుంది. దీనిపై 18 శాతం జీఎస్టీ పడుతుంది. కానీ ఇప్పటి బ్రెజ్జా లో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఎక్కువ ట్యాక్స్ కేటగిరీకి వెళ్తుంది, అంటే 40% GST లోకి వెళ్తుంది. ఫెర్ఫామెన్స్ పెరగడంతో పాటు ధర తగ్గుతుంది. ఇది కస్టమర్లకు మరింత లాభం చేకూరుస్తుంది.