Maruti Brezza CNG: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సేల్స్‌లో దూసుకుపోతున్న మారుతి మారో కొత్త కారును తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ కారు ఏదో కాదు.. ఇప్పటికే మార్కెట్లో మంచి పేరుగాంచిన మారుతి సుజుకి బ్రెజ్జాకు సంబంధించిన సీఎన్‌జీ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే పరీక్షల దశలో ఉన్న కొత్త బ్రెజ్జా మోడల్‌లో అండర్‌బాడీ సిఎన్‌జీ ట్యాంక్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మార్పు వచ్చే ఫేస్‌లిఫ్ట్ బ్రెజ్జాలో అంటే ఎంవై26 మోడల్‌గా వచ్చే అవకాశం ఉందని ఆటో రంగంలో చర్చ ఊపందుకుంది. ఇప్పటి వరకు సీఎన్‌జీ కార్లలో గ్యాస్ సిలిండర్ బూట్ స్పేస్‌ను ఎక్కువగా ఆక్రమించడం ఓ ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మారుతి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించేందుకు టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీలు ట్విన్ సిలిండర్ సెట్‌అప్‌లను పరీక్షిస్తున్నాయి. కానీ మారుతి మాత్రం కొత్తగా ప్లాన్ చేస్తోంది. సీఎన్‌జీ ట్యాంక్‌ను వాహనం కింద అమర్చే అండర్‌బాడీ డిజైన్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
READ MORE: 100x జూమ్ నుంచి 6200mAh బ్యాటరీ వరకు.. స్మార్ట్ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం.. నేడే vivo X200T లాంచ్..!
ఇప్పటికే ఈ టెక్నాలజీని మారుతి తొలిసారి గత ఏడాది సెప్టెంబర్‌లో విక్టోరిస్ మోడల్‌లో పరిచయం చేసింది. ఇప్పుడు అదే పద్ధతిని బ్రెజ్జాలోనూ తీసుకురావాలని చూస్తోంది. తాజాగా ట్రూ కార్ అడ్వైస్ అనే యూట్యూబ్ ఛానల్ విడుదల చేసిన వీడియోలో కొత్త బ్రెజ్జా కనిపించింది. దానిలో మారుతి కొత్త ఎస్-సీఎన్‌జీ అండర్‌బాడీ సెటప్ స్పష్టంగా కనిపించడంతో ఈ విషయం దాదాపు ఖరారైనట్టే అర్థమవుతోంది. కారు మీద కేమోఫ్లాజ్ లేకపోవడం చూస్తే.. ఈ మోడల్ ఉత్పత్తికి దగ్గరలోనే ఉందని స్పష్టమవుతోంది. పరీక్షల కోసం ఉపయోగిస్తున్న వాహనంపై ఎరుపు రంగు టెస్ట్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి. హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, మొత్తం డిజైన్ మాత్రం ఇప్పటి బ్రెజ్జాలానే ఉన్నాయి. చక్రాలు మాత్రం పూర్తిగా నల్లగా కనిపించాయి. అంటే బయట రూపంలో పెద్ద మార్పులు లేవు. అయితే.. అండర్‌ఫ్లోర్ సీఎన్‌జీ ట్యాంక్ వల్ల బూట్ స్పేస్ అధికంగా ఉంటుంది. కుటుంబంతో ట్రిప్‌లకు వెళ్లే వారికి ఇది చాలా ఉపయోగకరంగా మారనుంది. సామాన్లు పెట్టుకునే విషయంలో ఇక పెద్దగా రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ప్రాక్టికాలిటీ విషయంలో బ్రెజ్జా మరో మెట్టు ఎక్కినట్టేనని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Rajinikanth: 5 రూపాయల పరోటా వెనుక సూపర్ స్టార్ కథ.. అభిమాని చేసిన పనికి రజినీ ఫిదా!
ఇంజిన్ విషయంలోనూ పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పటివరకు ఉన్నట్లే కె15సి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగించే అవకాశం ఉంది. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజిన్ 99 హెచ్‌పీ శక్తి, 137.1 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో అయితే 87 హెచ్‌పీ, 121.5 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న బ్రెజ్జా సీఎన్‌జీ మోడల్‌లో 55 లీటర్ల వాటర్ ఈక్వివలెంట్ ట్యాంక్ ఉంటుంది. మైలేజ్ సుమారు 25.51 కిలోమీటర్లు ఫర్ కేజీ ఇస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త అండర్‌బాడీ ట్యాంక్‌తో ఈ గణాంకాల్లో స్వల్ప మార్పులు రావచ్చు. ఫీచర్ల విషయంలోనూ బ్రెజ్జాను మరింత ఆకర్షణీయంగా మార్చాలని మారుతి భావిస్తోంది. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో వెంటిలేటెడ్ సీట్లు రావచ్చని సమాచారం. అలాగే పెద్ద 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. భద్రత విషయంలో మరో అడుగు ముందుకెళ్లి లెవల్ 2 ఏడీఏఎస్ సదుపాయాలను ఇవ్వవచ్చని తెలుస్తోంది.
