కారు కొనాలనుకుంటే.. బుక్ చేస్తే రెండు మూడు నెలల్లో డెలవరీ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో డిమాండ్ అధికంగా ఉంటే 6-7 నెలల వరకు పడుతుంది. అయితే మహీంద్రా ఎక్స్ యూవీ 700 బుక్ చేస్తే కారు రావాలంటే రెండేళ్లు ఆగాల్సిందే. ఈ కార్ సెలెక్టెడ్ మోడల్స్ లో వేయిటింగ్ పిరియడ్ రెండేళ్ల వరకు ఉంది.ఒక వేళ మీరు ఈ కార్ ను ఇప్పుడు బుక్ చేస్తే కార్ రావడానికి 2024 వరకు వేచిచూడాల్సిందే. అంతలా ఈ కార్ కు డిమాండ్ ఏర్పడింది. అయితే దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఈ కార్ డెలవరీని ఆలస్యం చేస్తున్నాయి.
మహీంద్రా సంస్థ నుంచి వస్తున్న ఎక్స్ యూ వీ 700 కార్ మార్కెట్ లోకి రాకముందే క్రేజ్ తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే 50,000 బుక్సింగ్స్ వచ్చాయి. దీంతో సంస్థ కార్ల కస్టమర్లకు డెలవరీ ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటోంది. ప్రస్తుతం ఎక్స్ యూవీ 700 ప్రారంభం ధర రూ. 13.18 లక్షలు ఉంది. ఇదిలా ఉంటే దీంట్లో టాప్ వేరియంట్ రేంజ్-టాపింగ్ ఏఎక్స్7ఎల్ ట్రిమ్ వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాల వరకు ఉంది. ఎంట్రీ-స్పెక్ ఎంఎక్స్ ట్రిమ్ దాదాపు 7 నెలల వేయిటింగ్ పిరియడ్ ఉంది. ఏఎక్స్7ఎల్ వేరియంట్ కు 22 నెలలు, ఏఎక్స్7 వేరియంట్ కు 20 నెలలు, ఏఎక్స్5 వేరియంట్ కు 5 నెలల వేయిటింగ్ పిరియడ్ ఉంది.
ఇదిలా ఉంటే కార్ కు డిమాండ్ ఏర్పడటంతో పాటు కరోనా పరిస్థితులు, యుద్ధ ప్రభావం, సెమికండక్టర్ల కొరత, గ్లోబర్ సప్లై చైన్ దెబ్బతినడం ఇలా కార్ల డెలవరీలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా థార్, హ్యుందాయ్ క్రేటాకు వెయిటింగ్ పిరియడ్ ఎక్కువగా ఉన్న కార్లుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ జాబితాలో మహింద్రా ఎక్స్ యూ వీ700 కూడా నిలిచింది.