Site icon NTV Telugu

Mahindra XUV 3XO EV: మహీంద్రా XUV 3XO EV లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు, ఆకర్షణీయమైన ధర..

Mahindra Xuv 3xo Ev

Mahindra Xuv 3xo Ev

Mahindra XUV 3XO EV: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న XUV 3XO EVని మహీంద్రా లాంచ్ చేసింది. రూ. 13.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పరిచయం చేసింది. మహీంద్రా XUV 7XO విడుదలైన కేవలం ఒక రోజు తర్వాత ఇది రావడం విశేషం. ఇండియాలో ప్రస్తుతం ఉన్న బలమైన ఈవీ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికి మహీంద్రా XUV 3XO EV బరిలో నిలిచింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ EV మంచి అమ్మకాలను కనబరుస్తోంది. ఇప్పుడు దీనికి మహీంద్రా ఈవీ టఫ్ కాంపిటీషన్ ఇవ్వనుంది.

మహీంద్రా XUV 3XO EV: బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ వివరాలు.

మహీంద్రా XUV 3XO EV 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది 285 కి.మీ. వరకు ప్రాక్టికల్ రియల్ రేంజ్‌ను అందిస్తుంది. ఇది రోజూవారీ ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 110 kW శక్తిని, 310 Nm టార్క్‌ను అందిస్తుంది. వలం 8.3 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీంట్లో ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ అని మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డ్యాంపింగ్ (FDD), MTV-VALతో సహా అధునాతన సస్పెన్షన్ టెక్నాలజీలతో రావడంతో ఫన్ రైడింగ్ అందిస్తుంది. దీని ద్వారా స్థిరత్వం, బెటర్ హ్యాండ్లింగ్ చేయవచ్చు.

మహీంద్రా XUV 3XO EV: ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్స్..

XUV 3XO EV సొగసైన సింగిల్-పేన్ సన్‌రూఫ్ మరియు ట్విన్ 10.25-అంగుళాల HD డిస్ప్లేలను కలిగి ఉంది. ఇందులో ఒకటి ఇన్ఫొటైన్‌మెంట్ క్లస్టర్, మరొకటి ఇన్ట్రుమెంటర్ క్లస్టర్ ఉంటుంది. R16 డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కారును మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ LED టెయిల్ ల్యాంప్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌లతో LED DRLలు ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.

డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, పాసివ్ కీలెస్ ఎంట్రీ ని కలిగి ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఇన్‌బిల్ట్ అలెక్సాతో అడ్రినాక్స్, ఆన్‌లైన్ నావిగేషన్ ఉన్నాయి. ఆరు స్పీకర్లు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, రియర్ ఏసీ వెంట్లు, కప్ హోల్డర్స్, సెంట్రల్ ఆర్మ్ రెస్ట్, 60:40 స్ప్లిట్ సీట్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు కలిగి ఉంది.

భద్రతకు పెద్ద పీట.

ఇది రిమోట్ వెహికల్ కంట్రోల్, వెహికల్ స్టేటస్ మానిటరింగ్, ట్రిప్ సారాంశం, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, ఇన్-కార్ యాప్‌లకు సపోర్ట్ చేసే 80+ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లతో కూడిన అడ్రినాక్స్‌తో కారు వస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, స్మార్ట్ పైలట్ అసిస్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ మొదలైన ఫీచర్లతో లెవల్ 2 ADAS. 360 డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 4 డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ , వీటిలో సహా 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా XUV 3XO EV: ధర , వేరియంట్లు.

మహీంద్రా XUV 3XO EV ప్రారంభ ధర రూ. 13.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది, ఇది AX5 ట్రిమ్ ధర కాగా, AX7L వేరియంట్ ధర రూ. 14.96 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Exit mobile version