Mahindra XEV 9S First Drive Review: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా XEV 9Sను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను (ఎక్స్-షోరూమ్) రూ. 19.95 లక్షలుగా ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి టాప్-3 స్థానంలో SUV XEV 9S చోటు దక్కించుకుంది. అంతే కాదు.. భారతదేశపు మొట్టమొదటి 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV ఇదే కావడం విశేషం. ఇందులో 79 kWh పెద్ద బ్యాటరీ ఉంది..
READ MORE: Raccoon: మద్యం దుకాణంలో మందు తాగి పడుకున్న జంతువు.. కంగుతిన్న ఓనర్
“డెజర్ట్ మిస్ట్” రంగులో ఆకర్శనీయంగా ఉన్న ఈ SUV సైజులో పెద్దగా, శక్తివంతంగా కనిపిస్తుంది. ఫ్యామిలీ EVల రూపురేఖల్ని మార్చబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. XEV 9S డిజైన్ పూర్తిగా SUV ఫీలింగ్ ఇస్తుంది. శబ్దం అస్సలు ఉండదు. వెడల్పైన బాడీ, సింపుల్ లైన్స్, అనవసరమైన డిజైన్స్ కాకుండా క్లీన్ డిజైన్ ఉంది. ఇల్యూమినేటెడ్ లోగో, సీక్వెన్షియల్ ఇండికేటర్లు, పెద్ద పానోరామిక్ సన్‌రూఫ్, లోపల మూడు పెద్ద స్క్రీన్లు.. ఇవన్నీ ఆధునికతను చూపిస్తాయి.. డిజైన్ మొత్తం సింపుల్, క్లాసీగా ఉంది.
లోపలికి వెళితే.. ఈ కారు అసలైన బలం స్పేస్ అని వెంటనే తెలుస్తుంది. సీట్లు పెద్ద సైజు కలిగి ఉన్నాయి. ముందుభాగంలో 150 లీటర్ల ఫ్రంక్, వెనక 3వ వరుస సీట్లు మడిస్తే 500 లీటర్ల బూట్ ఉంటుంది. ఫ్యామిలీస్‌కి చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. రెండో వరుసలో వెంటిలేటెడ్ సీట్లు, స్లైడింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని ముఖ్యమైన ఫీచర్ “పవర్డ్ బాస్ మోడ్”. బటన్ నొక్కగానే ముందు ప్యాసింజర్ సీటు ముందుకు వెళ్లి వెనక కూర్చున్న వారికి లగ్జరీ లెగ్రూమ్ ఇస్తుంది. డ్రైవర్‌తో ప్రయాణించే కుటుంబాలకు ఇది నిజంగా మంచి సౌకర్యం.
READ MORE: Mohit Sharma: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన టీమిండియా ప్లేయర్..!
కేబిన్ క్వాలిటీ చాలా వరకు ప్రీమియంగా ఉంటుంది. లెదరెట్ సీట్లు, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, మంచి రూఫ్ లైనర్ లు లగ్జరీ కారును తలపించేలా ఉంటాయి. కానీ కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. పియానో బ్లాక్ భాగాలు వెంటనే దుమ్ము, వేలిముద్రలు పట్టేస్తాయి. స్టీరింగ్‌పై బటన్లు చిన్నగా, ఎక్కువగా ఉండటం వల్ల అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. హజర్డ్ లైట్, కెమెరా వంటి వాటికి ఉన్న టచ్ బార్ కొన్నిసార్లు నొక్కినా స్పందించదు. ఇవి చిన్న విషయాలే కానీ రోజూ ఉపయోగించే వారికి అసౌకర్యం కలిగించే అవకాశముంది.
టెక్నాలజీ విషయానికి వస్తే ఇది చకచకా పని చేసే “లివింగ్ రూమ్ ఆన్ వీల్స్”లా ఉంటుంది. ముందు మూడు పెద్ద 31.24 సెం.మీ. స్క్రీన్లు.. డ్రైవర్‌కు ఒకటి, ఇన్ఫోటైన్‌మెంట్‌కు ఒకటి, ప్యాసింజర్‌కు ఒకటి ఉన్నాయి. వీటి రిజల్యూషన్ షార్ప్, UI చాలా స్మూత్ గా ఉంది. Snapdragon 8295 ప్రాసెసర్, 24GB RAM వల్ల సిస్టమ్ అద్భుతంగా పని చేస్తుంది. అత్యుత్తమ ఆడియో అనుభవం కోసం Harman Kardon 16 స్పీకర్లతో Dolby Atmos సౌండ్ సిస్టమ్ ఉంది. OTT యాప్‌లు, కార్ కెమెరా ద్వారా వీడియో కాల్స్, 5G నెట్‌వర్క్, వెనుక వైర్‌లెస్ చార్జింగ్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఈ కారును ఒక చిన్న థియేటర్, ఆఫీస్‌లా మారుస్తాయి.
READ MORE: Mohit Sharma: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన టీమిండియా ప్లేయర్..!
డ్రైవింగ్ మొదలెడితే.. సీటింగ్ పొజిషన్ చాలా హైగా ఉండి రోడ్డుపై మంచి విజిబిలిటీ ఇస్తుంది. అయితే A-పిల్లర్ కొద్దిగా మందంగా ఉండటం వల్ల మలుపుల వద్ద బ్లైండ్ స్పాట్ కనిపిస్తుంది. రైడ్ క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది. బంప్స్, రఫ్ రోడ్స్‌లో కూడా కారు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. హైవేపై స్పీడ్‌లో స్టేబుల్‌గా ఉంటుంది. మలుపుల్లో కూడా ఎలాంటి భయం ఉండదు. సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ లైట్‌గా, హిల్స్‌లో కొంచెం హెవీగా మారుతుంది. స్పోర్టీగా కాకపోయినా, కాన్సిస్టెంట్‌గా పనిచేస్తుంది. కేబిన్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. 80-90 km/h వేగంతో వెళ్లినా లోపల చాలా సైలెంట్ గా ఉంటుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కారు 210 kW పవర్, 380 Nm టార్క్ ఇస్తుంది. టార్క్ వెంటనే అందుతుంది. సింగిల్ పెడల్ డ్రైవింగ్ సులభంగా ఉంటుంది. రీజెన్ బ్రేకింగ్ కూడా అంచనా వేసినట్టే పనిచేస్తుంది. ఇది రేసింగ్ కోసం కాకుండా, రోజువారి డ్రైవింగ్ కోసం అద్భుతంగా సెట్ చేసిన SUVగా చెప్పవచ్చు. రేంజ్ పరంగా మహీంద్రా 500 km సిటీ రేంజ్ అని చెబుతోంది. మిక్స్ డ్రైవింగ్‌లో 120 km వెళ్లిన తర్వాత ఆ క్లెయిమ్ సాధ్యమే అనిపిస్తుంది. DC ఫాస్ట్ చార్జింగ్‌లో 20% నుంచి 80% వరకు 20 నిమిషాల్లో చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. దీన్ని ఇంకా పూర్తిగా పరీక్షించలేదు.
READ MORE: Localbody Elections: రక్త సంబంధీకుల మధ్య పోటీ..! సర్పంచ్ బరిలో అన్నాచెల్లెళ్లు.. అన్నాతమ్ముడు..
కాగా.. ఈ కారు ఇండియాలో కొత్త సెగ్మెంట్‌ను సృష్టిస్తోంది. పెద్ద కుటుంబాలు, SUV ప్రెజెన్స్ కోరుకునేవారు, పెట్రోల్ ఆటోమేటిక్ కార్ల ఖర్చులకు విసిగిపోయిన వారు, రూ.30 లక్షల్లో లగ్జరీ ఫీచర్లతో EV కావాలనుకునేవారందరికీ ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.. అయితే ఈ కారును మరింత మొరుగ్గా చేయాల్సి అవసరం ఉంది. ముఖ్యంగా సెంట్రల్ టచ్ బార్ స్పందన మరింత మంచిగా ఉండాలి. పియానో బ్లాక్ భాగాలు తగ్గిస్తే బాగుంటుంది. A-పిల్లర్ బ్లైండ్ స్పాట్ సమస్యకు కొత్త డిజైన్ అవసరం. స్టీరింగ్ బటన్లు సాధారణంగా, పెద్దగా ఉండాలి. ఇవి పెద్ద లోపాలు కాకపోయినా, గమనించాల్సినవే.
