Mahindra Thar vs Maruti Suzuki Jimny: ఇండియన్ కార్ మార్కెట్లో ఆఫ్ రోడ్ కార్ల హవా పెరుగుతోంది. ముందుగా మహీంద్రా నుంచి వచ్చిన థార్ కార్ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ ఆఫ్ రోడర్ కి యూత్ ఫిదా అయింది. ఆ తరువాత ఇతర కార్ కంపెనీలు కూడా ఆఫ్ రోడ్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా థార్ కు పోటీగా మారుతి సుజుకీ జిమ్నీని లాంచ్ చేసింది. ఈ రెండు కార్ల మధ్య భారీ పోటీ నెలకొంది. ఇటీవల జిమ్నికి కూడా పెద్ద ఎత్తున బుకింగ్స్ జరిగాయి.
ఇదిలా ఉంటే ఈ రెండు కార్ల మధ్య పోలిక అనేది సాధారణంగా వినియోగదారుల్లో వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య మైలేజ్, ఇంజిన్ ఆప్షన్స్, ధరల్ని కంపార్ చేద్ధాం.
* జిమ్ని, థార్ రెండూ కూడా 4 వీల్ డ్రైవ్(4WD)తో వస్తున్నాయి.
* మారుతి సుజుకి జిమ్ని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 103 బీహెచ్పీ, 134 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్లలో లభ్యం అవుతోంది. దీని అన్ని వేరియంట్లలో కూడా 4వీల్ డ్రైవ్ ఉంది.
థార్ లో ప్రస్తుతం 3 ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ D117 CRDe డీజిల్ ఇంజిన్ 117 బీహెచ్పీ పవర్ 300ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది. 2.2 లీటర్ mHawk 130 CRDe డిజిల్ ఇంజిన్ 130 బీహెచ్పీ, 300 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2.0 లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్ 150 బీహెచ్పీ, 350 టార్క్ కలిగి ఉంటుంది. 1.5 లీటర్ డిజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2.2 డిజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్, 6స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ ఛాయిస్ లను కలిగి ఉంది.
* జిమ్ని పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 4 వీల్ డ్రైవ్ లీటర్ కి 16.94 కిలోమీటర్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. అయితే జిమ్ని పెట్రోల్ ఆటోమేటిక్ 4 4WD 16.39kmpl కంటే తక్కువ మైలేజ్ ఇస్తుంది. ఇక థార్ పెట్రోల్ 4WD సుమారు 13kmpl మైలేజీని కలిగి ఉంది.
* మారుతి జిమ్ని ధర:
కొత్తగా లాంచ్ అయిన మారుతి సుజుకి జిమ్నీ జీటా, ఆల్ఫా ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. వేరియంట్‌ల వారీగా మారుతి సుజుకి జిమ్నీ ధరలు (ఎక్స్-షోరూమ్) క్రింద ఉన్నాయి.
జీటా MT – రూ. 12.74 లక్షలు
జీటా AT – రూ. 13.94 లక్షలు
ఆల్ఫా MT – రూ. 13.69 లక్షలు
ఆల్ఫా ఏటీ – రూ. 14.89 లక్షలు
ఆల్ఫా MT (డ్యూయల్ టోన్) – రూ. 13.85 లక్షలు
ఆల్ఫా AT (డ్యూయల్ టోన్) – రూ. 15.05 లక్షలు
* థార్ రూ. 10,54,500 నుండి ప్రారంభమై రూ. 16,77,501 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.