Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ రికార్డ్.. గంటలో ఏకంగా 1.76 లక్షల బుకింగ్స్..
- బుకింగ్స్‌లో మహీంద్రా థార్ రాక్స్ రికార్డ్..
- గంటలోనే 1.76 లక్షల కన్నా ఎక్కువ బుకింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Thar Roxx: మహీంద్రా అండ్ మహీంద్రా ఆఫ్ రోడర్ థార్ రాక్స్ రికార్డ్ సృష్టిస్తోంది. 5-డోర్ వెర్షన్‌గా ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఎస్‌యూవీపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, బుకింగ్స్‌లో థార్ రాక్స్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు బుకింగ్స్ ప్రారంభించిన 60 నిమిషాల్లోనే థార్ రాక్స్ ఏకంగా 1,76,218 బుకింగ్‌లను పొందినట్లు కంపెనీ ప్రకటించింది. దసరా నుంచి ఈ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభమవుతాయి.
Read Also: Typhoon Krathon: దక్షిణ తైవాన్‌ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
కొనుగోలుదారులు ఆథరైజ్డ్ మహీంద్రా డీలర్‌షిప్‌ల వద్ద, మహీంద్రా వెబ్‌సైట్ ద్వారా రూ.21,000 టోకెన్ మొత్తానికి థార్ రాక్స్ బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ప్రారంభమైన తర్వాత కస్టమర్లకి కంపెనీ కారు డెలివరీ షెడ్యూల్‌ని మూడు వారాల్లో దశల వారీగా తెలియజేస్తుంటారు. థార్ 3-డోర్ మరియు రోక్స్ రెండింటికీ కలిపి నెలకు 9,500 నుండి 10,000 యూనిట్ల వరకు మాత్రమే ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో ఎక్కువ కాలం ఈ కార్ కోసం కస్టమర్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థార్ రాక్స్ 4X4 వేరియంట్స్, ముఖ్యంగా డార్కర్ మోచా బ్రౌన్ ఇంటీరియర్ షేడ్స్ కలిగిన వెహికిల్ అందుకోవడానికి జనవరి 2025 వరకు వేచిచూడాల్సి వస్తుందని చెప్పింది.
థార్ రాక్స్ మొత్తం ఆరు వేరియంట్లు–MX1, MX3, AX3L, MX5, AX5L, AX7L లను కలిగి ఉంది. రెండు ఇంజన్ ఆఫ్షన్లు G20 TGDI mStallion పెట్రోల్, D22 mHawk డీజిల్ ఇంజన్లను కలిగి ఉంటుంది. థార్ రాక్స్ పెట్రోల్ వేరియంట్‌లో కేవలం రేర్ వీల్ డ్రైవ్(RWD)ని కలిగి ఉంటుంది. డిజిల్ వేరియంట్ రేర్ వీల్ డ్రైవ్(RWD), ఫోర్ వీల్ డ్రైవ్( 4WD) (4XPLOR)ని కలిగి ఉంటుంది.
వేరియంట్ వారీగా మహీంద్రా థార్ రాక్స్ ధరలు (ఎక్స్-షోరూమ్):
MX1 RWD పెట్రోల్ MT – రూ. 12.99 లక్షలు
MX1 RWD డీజిల్ MT – రూ. 13.99 లక్షలు
MX3 RWD పెట్రోల్ AT – రూ. 14.99 లక్షలు
MX3 RWD డీజిల్ MT – రూ. 15.99 లక్షలు
AX3L RWD డీజిల్ MT – రూ. 16.99 లక్షలు
MX5 RWD డీజిల్ MT – రూ. 16.99 లక్షలు
AX5L RWD డీజిల్ AT – రూ. 18.99 లక్షలు
AX7L RWD డీజిల్ MT – రూ. 18.99 లక్షలు
AX7L RWD పెట్రోల్ AT – రూ. 19.99 లక్షలు
AX7L RWD డీజిల్ AT – రూ. 20.49 లక్షలు
MX5 4WD డీజిల్ MT – రూ. 18.79 లక్షలు
AX7L 4WD డీజిల్ MT – రూ. 20.99 లక్షలు
AX5L 4WD డీజిల్ AT – రూ. 20.99 లక్షలు
AX7L 4WD డీజిల్ AT – రూ. 22.49 లక్షలు
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!