Mahindra new SUVs 2025: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మహీంద్రా & మహీంద్రా నుంచి ఒకేసారి 4 కొత్త కాన్సెప్ట్ SUVలు విడుదలయ్యాయి. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ విజన్ X, విజన్ T, విజన్ S, విజన్ SXTలను ప్రపంచానికి పరిచయం చేసింది. నాలుగు SUVలు వేర్వేరు డిజైన్లతో వచ్చినప్పటికీ, అవన్నీ కంపెనీ కొత్తగా ప్రారంభించిన NU.IQ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. NU.IQ ప్లాట్‌ఫామ్ పరిచయంతో మహీంద్రా విదేశీ మార్కెట్లలో కూడా తన పట్టును బలోపేతం చేసుకోవడానికి సిద్ధమవుతోనట్లు తెలుస్తుంది. ఈ నాలుగు SUVలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం..
READ MORE: Nara Lokesh: నా క్రెడిట్ కార్డు బిల్లు నా భార్యే కడుతుంది.. మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు..!
మహీంద్రా విజన్ టి.. విజన్ ఎస్ఎక్స్ టి
మీరు Vision.T, Vision.SXT లను చూసినప్పుడు మొదటి చూపులో అవి గత సంవత్సరం వచ్చిన Thare కాన్సెప్ట్‌ను గుర్తుకు తెస్తాయి. కానీ Vision.T పూర్తిగా బాక్సీ బాడీని కలిగి ఉంటుంది. మరోవైపు Vision.SXT ట్రక్కు లాంటి క్యాబిన్‌ను కలిగి ఉంది. దాని డెక్‌పై స్పేర్ వీల్స్ అమర్చబడి ఉండటంతో పాటు మొత్తంమీద డిజైన్ దృఢంగా, ఆకర్షణీయంగా ఉంది. ప్రొడక్షన్ వెర్షన్ లుక్ కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
మహీంద్రా విజన్ ఎస్
మహీంద్రా విజన్ ఎస్ కాన్సెప్ట్ కారుకు కంపెనీ బాక్సీ ఆకారాన్ని ఇచ్చింది. బాడీపై స్రైట్ లైన్స్, ముందు భాగంలో ట్విన్ పీక్స్ లోగోకు ఇరువైపులా మూడు నిలువు LED లైట్లు ఉన్నాయి. ఇవి తలక్రిందులుగా ఉన్న L-ఆకారపు హెడ్లైట్ల మధ్య వంతెనగా పనిచేస్తాయి. దిగువ బంపర్లో రాడార్ యూనిట్, పార్కింగ్ సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ఆసక్తికరంగా పిక్సెల్ ఆకారపు ఫాగ్ లాంప్లు హ్యుందాయ్ నెక్సో, ఫాగ్ లాంప్లకు మధ్య చాలా పోలికలు ఉన్నాయి. బోనెట్‌పై ఉన్న లింబ్ రైజర్, రూఫ్-మౌంటెడ్ లైట్లు ఉత్పత్తి మోడల్లో కనిపించకపోవచ్చు. తలుపుల కింద, వీల్ ఆర్చ్‌పై మందపాటి క్లాడింగ్ ఉంటుంది. 19-అంగుళాల చక్రాలపై నిలబడి ఉన్న ఈ SUV వెనుక భాగంలో ఎరుపు కాలిపర్లను పొందపర్చి ఉంది. ఇది కార్‌కు స్పోర్టీ లుక్ ఇస్తుంది.
మహీంద్రా విజన్ ఎక్స్
మహీంద్రా విజన్ X కాన్సెప్ట్ స్పోర్టి, క్రాస్ఓవర్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. అయినప్పటికీ ఇది నిటారుగా ఉండే తీరు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. దీని ఆకర్షణీయమైన బోనెట్, ముందు విండ్ షీల్డ్ రేక్, దాదాపు కూపే లాంటి వెనుక విండ్రన్ దీనికి ప్రత్యేకమైన డిజైన్‌ను ఇస్తున్నాయి. దీని స్పాయిలర్ మీకు మహీంద్రా ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV BE 6 ని గుర్తు చేస్తుంది. ముందు, వెనుక వైపున ఉన్న సన్నని లైటింగ్, ముందు బంపర్, ఫాగ్ లైట్ క్లస్టర్ XEV 9eని పోలి ఉంటాయి. ఇతర కాన్సెప్ట్ మోడళ్ల మాదిరిగానే, విజన్ X మహీంద్రా NU_IQ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడింది. ఇది మోనోకోక్ ఆర్కిటెక్చర్ 3,990 mm నుంచి 4,320 mm వరకు పొడవు గల SUV లకు అనుకూలంగా ఉంటుంది. దీని వీల్బేస్ 2,665 mm. విజన్ X పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
READ MORE: Pakistan flash floods: పాక్‌లో ఘోరం.. 24 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు
