Mahindra Bolero Neo: మహీంద్రా తన బొలెరో నియో (Bolero Neo) లైనప్‌పై ధరలను పెంచింది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్టంగా రూ.20,000 వరకు పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. తాజా ధరల ప్రకారం బొలెరో నియో ప్రారంభ ధర ఇప్పుడు రూ.8.69 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, ముడి సరుకుల ధరలు, పరిశ్రమలో కొనసాగుతున్న వార్షిక ధర సవరణల నేపథ్యంలో ఈ పెంపు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోయర్ వేరియంట్లపై ఎక్కువ ప్రభావం పడింది. ఇక, బొలెరో నియోలో బేస్ వేరియంట్ అయిన N4కి అత్యధికంగా రూ.20 వేల పెంచినట్లు తెలిపారు. గతంలో రూ.8.49 లక్షలుగా ఉన్న ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ.8.69 లక్షలకు చేరింది. సుమారు ఇది 2.36 శాతం పెరుగుదలగా నమోదైంది.
Read Also: Gold-Silver Rates: మళ్లీ దుమ్మురేపుతోన్న వెండి, గోల్డ్ ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
వేరియంట్ వారీగా ధరలు..
* N4: పాత ధర రూ.8,49,000 → పెంపు రూ.20,000 → కొత్త ధర రూ.8,69,000 (2.36%)
* N8: పాత ధర రూ.9,29,000 → పెంపు రూ.16,000 → కొత్త ధర రూ.9,45,000 (1.72%)
* N10: ధర మార్పు లేదు → రూ.9,79,000
* N11: ధర మార్పు లేదు → రూ.9,99,000
* N10 (O): ధర మార్పు లేదు → రూ.10,49,000
ఇక, మహీంద్రా బొలెరో నియోను 2025లో బొలెరో మోడల్‌తో పాటు అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా కార్ ఇంటీరియర్‌ను మరింత ప్రీమియంగా మార్చారు. క్యాబిన్‌లో కొత్త డిజైన్, లెదరెట్ సీట్లు, మెష్ ప్యాటర్న్‌తో కూడిన ఫినిషింగ్ అందించారు. టాప్ వేరియంట్‌కు లూనార్ గ్రే కలర్ థీమ్ ఉండగా, తక్కువ ధర వేరియంట్లకు మోకా బ్రౌన్ కలర్ థీమ్‌ను జత చేశారు. ఇది ఇంటీరియర్‌కు మరింత ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తోంది. అలాగే, ఈ అప్‌డేట్‌తో బొలెరో నియోలో రియర్ వ్యూ కెమెరా, 22.9 సెంటీమీటర్ల (సుమారు 9 ఇంచ్) ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందించారు. ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతున్నాయి.
Read Also: Jana Nayagan : ‘జన నాయగన్’ సెన్సార్ గండం దాటుతుందా? నేడే ఫైనల్ తీర్పు!
కాగా, ఇంజిన్ విషయానికి వస్తే, మహీంద్రా బొలెరో నియోలో 1.5 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 98.5 హెచ్‌పీ పవర్, 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అందుబాటులో ఉంది. మొత్తంగా చూస్తే, ధరలు కొంత పెరిగినా, అప్‌డేటెడ్ ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్, బలమైన డీజిల్ ఇంజిన్ కారణంగా బొలెరో నియో తన సెగ్మెంట్‌లో ఇంకా ఆకర్షణీయమైన ఎంపికగానే నిలుస్తోంది.
