NTV Telugu Site icon

Mahindra BE 6e And XEV 9e: మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు.. BE 6e, XEV 9e డెలివరీ, ఫీచర్స్..

Be 6e, Xev 9e

Be 6e, Xev 9e

Mahindra BE 6e And XEV 9e: స్వదేశీ కార్ మేకర్ మహీంద్రా తన బ్యాండ్ న్యూ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. మహీంద్రా బ్రాండ్-న్యూ INGLO EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన BE 6e, XEV 9e ఎలక్ట్రిక్ కార్లు రిలీజ్ అయ్యాయి. BE 6e ధర రూ. 18.90 లక్షల నుంచి, XEV 9e ధర రూ. 21.90 లక్షల(ఎక్స్ షోరూం) ధర నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ధరల్లో చార్జర్ ధరల్ని చేర్చలేదు. ఈ రెండు ధరలు కూడా ఎంట్రీ లెవల్ ధరలే అని తెలుస్తోంది. ఈ రెండు కార్ల పూర్తి ధరలు 2025 జనవరిలో తెలియజేయనుంది.

Read Also: Brand Market: బాలీవుడ్ స్టార్లను మించిపోయిన భారత క్రికెటర్లు.. కోహ్లీ, ధోనీ, సచిన్ టాప్ త్రీ

ప్రస్తుతానికి కార్లకు సంబంధించి పూర్తి వివరాలను మహీంద్రా వెల్లడించలేదు. జనవరి 2025 నుంచి ఈ రెండు ఈవీల బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీ ఫిబ్రవరి లేదా మార్చి 2025 నాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. రాబోయే భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఈ రెండు కార్లను ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ రెండు కార్లపై కస్టమర్లు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రీలీజ్ అయిన ఈ కార్ల డిజైన్ అందర్ని ఆకట్టుకుంటోంది.

రెండు ఈవీలు కూడా LED DRLలు, LED టెయిల్ ల్యాంప్‌లు, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటాయి. ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటాయి. రెండు కార్లు 59 kWh మరియు 79 kWh బ్యాటరీ ప్యాక్ ఆఫ్షన్లను అందిస్తోంది. BE 6e 535 కిమీ, 682 కిమీల రేంజ్‌ని అందిస్తుంది. XEV 9e వేరియంట్ ఆధారంగా 542 కిమీ మరియు 656 కిమీ రేంజ్‌ని కలిగి ఉంది. పవర్ అవుట్‌పుట్‌కి సంబంధించి 59 kWh వేరియంట్‌ 231 hp పవర్, 380 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 79 kWh వేరియంట్‌ 268hp పవర్, 380 Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.