NTV Telugu Site icon

Mahindra BE 6, XEV 9e Prices: మహీంద్రా BE 6, XEV 9e వేరియంట్ల వారీగా ధరలు తెలుకుందామా?

Mahindra Be 6, Xev 9e

Mahindra Be 6, Xev 9e

మహీంద్రా కొన్ని రోజుల క్రితం భారతదేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్​ కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అవే.. ఎక్స్​ఈవీ 9ఈ, బీఈ 6ఈ. విశేషమేమిటంటే కంపెనీ.. ఈ రెండింటికి సంబంధించిన బేస్ వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. మిగతా వేరియంట్ల ధరలు వెల్లడించలేదు. ఈ నెలలో కంపెనీ ఈ రెండు ఎస్‌యూవీల మొత్తం లైనప్ ధరలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు. కంపెనీ వివరాల ప్రకారం.. బీఈ6 59 kWh బ్యాటరీ ప్యాక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.90 లక్షలు. ఎక్స్​ఈవీ 9ఈ యొక్క 59 kWh బ్యాటరీ ప్యాక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.90 లక్షలుగా కంపెనీ నిర్ధారించింది. అయితే మనం ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల అంచనా ధరలను తెలుసుకుందాం..

వేరియంట్ల వారీగా మహీంద్రా బీఈ6 ధరలు( అంచానా ప్రకారం..)
బ్యాటరీ ప్యాక్                        –                   షోరూమ్ ధరలు
వన్ ప్యాక్ 59 kWh ధర రూ – 18.90 లక్షలు (కంపెనీ ధృవీకరించింది)
టూ ప్యాక్ 59 kWh ధర రూ – 20.20 లక్షలు (అంచనా)
త్రీ ప్యాక్ 59 kWh ధర రూ – 21.70 లక్షలు (అంచనా)
టూ ప్యాక్ 79 kWh ధర రూ – 21.70 లక్షలు (అంచనా)
త్రీ ప్యాక్ 79 kWh ధర రూ. – 23.20 లక్షలు (అంచనా)

వేరియంట్ల వారీగా మహీంద్రా XEV 9e ధరలు..
బ్యాటరీ ప్యాక్             –      షోరూమ్ ధరలు
ప్యాక్ వన్ 59 kWh ధర – రూ. 21.90 లక్షలు (కంపెనీ ధృవీకరించింది)
ప్యాక్ టూ 59 kWh ధర- రూ. 23.20 లక్షలు (అంచనా)
ప్యాక్ త్రీ 59 kWh ధర – రూ. – 24.70 లక్షలు (అంచనా)
ప్యాక్ టూ 79 kWh ధర – రూ. 24.70 లక్షలు (అంచనా)
ప్యాక్ త్రీ 79 kWh ధర – రూ. 26.20 లక్షలు (అంచనా)

ఇదిలా ఉండగా.. రెండు వాహనాలూ 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లకు సపోర్ట్‌ చేస్తాయి. తొలుత చిన్న బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌లను తీసుకురానున్నారు. రెండింటిలోనూ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది. 175 కిలోవాట్‌ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే 20-80 శాతం ఛార్జ్ అవుతుందని సంస్థ తెలిపింది. 79 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 km ప్రయాణించవచ్చు. యుద్ధ విమానాల నుంచి ప్రేరణ పొంది ఈ రెండు వాహనాల క్యాబిన్‌లు రూపకల్పన చేసినట్లు సంస్థ తెలిపింది. ఎక్స్‌ఈవీ 9ఈ క్యాబిన్‌లో ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంది. బీఈ 6ఈలో రెండు స్క్రీన్‌లు అమర్చారు. ఎక్స్‌ఈవీ 9ఈలో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్‌ వ్యవస్థలు ఉన్నాయి. బీఈ 6ఈలో సన్‌రూఫ్‌, ఏడీఏఎస్‌ వ్యవస్థ, 360 డిగ్రీ కెమెరా అమర్చారు. రెండింటిలోనూ 16 స్పీకర్లతో కూడిన హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్ ఉంది.

Show comments