Site icon NTV Telugu

Luxury Cars Prices Dropped: జీఎస్టీ తగ్గింపు.. లక్షల్లో దిగివస్తోన్న లగ్జరీ కార్ల ధరలు.. ఫుల్‌ లిస్ట్ ఇదిగో..

Luxury Cars Prices Dropped

Luxury Cars Prices Dropped

Luxury Cars Prices Dropped: జీఎస్టీ శ్లాబులు మారాయి.. గతంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉన్న పన్ను శ్లాబుల స్థానంలో ఇప్పుడు రెండు కేటగిరీలకు అంటే 5 శాతం, 18 శాతం సరళీకరించింది కేంద్ర ప్రభుత్వం.. అంటే, 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను పూర్తిగా ఎత్తివేసి.. 5 శాతం, 18 శాతం శ్లాబులను మాత్రమే కొనసాగిస్తోంది.. మరోవైపు కొత్తగా 40 శాతం పన్ను శ్లాబును తీసుకొచ్చింది. ఈనెల 22వ తేదీ నుంచే కొత్త జీఎస్టీ శ్లాబుల రేట్లు అమలులోకి రానున్నాయి. వీటి ద్వారా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలపై పన్ను భారం తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి.. అంతేకాదు, GST 2.0 కింద లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి.. మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్, జీప్ సంస్థల కార్ల ధరలు లక్షల్లో తగ్గనున్నాయి..

సెప్టెంబర్ 3, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో కొత్త GST శ్లాబులను ప్రకటించారు. ఈ సమావేశంలో, చిన్న-సెగ్మెంట్ కార్లకు మంత్రిత్వ శాఖ గొప్ప సడలింపును ప్రకటించింది. ఇంతలో, లగ్జరీ కార్లపై 40 శాతం జీఎస్టీ, సెస్ ఛార్జ్ లేదు. ఈ చర్యతో లగ్జరీ కార్ల ధరను కూడా తగ్గించింది, దీంతో, మీ కలల కారును మరింత తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం వచ్చింది..

లగ్జరీ కార్ల బ్రాండ్లు.. తగ్గిన ధరల జాబితా మీ కోసం..

మెర్సిడెస్-బెంజ్
మెర్సిడెస్-బెంజ్ ఏ 200 – రూ. 2.6 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ సీ 300 – రూ. 3.7 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఏ – రూ. 3.8 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌సీ – రూ. 5.3 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ ఈ-క్లాస్‌ ఎల్‌డబ్ల్యూబీ- రూ. 6 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఈ – రూ. 8 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఎస్‌ – రూ. 10 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ – రూ. 11 లక్షలు

బీఎండబ్ల్యూ
బీఎండబ్ల్యూ ఎక్స్‌7 – రూ. 8.9 లక్షలు
బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే – రూ. 1.6 లక్షలు
బీఎండబ్ల్యూ 3 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ – రూ. 3.4 లక్షలు
బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ – రూ. 4.1 లక్షలు
బీఎండబ్ల్యూ ఎక్స్‌ 1 – రూ. 1.8 లక్షలు
బీఎండబ్ల్యూ ఎక్స్‌ 5 – రూ. 6.6 లక్షలు

ఆడి
ఆడి ఏ4 – రూ. 2.64
ఆడి ఏ6 – రూ. 3.64 లక్షలు
ఆడి క్యూ3 – రూ. 3.7 లక్షలు
ఆడి క్యూ5 – రూ. 4.55 లక్షలు
ఆడి క్యూ7 – రూ. 6.15 లక్షలు
ఆడి క్యూ8 రూ. 7.83 లక్షలు

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)
* రేంజ్ రోవర్ – రూ. 4.6 లక్షల నుండి రూ. 30.4 లక్షల వరకు
* ల్యాండ్ రోవర్ డిఫెండర్ – రూ. 7 లక్షల నుండి రూ. 18.6 లక్షల వరకు
* ల్యాండ్ రోవర్ డిస్కవరీ – రూ. 4.5 లక్షల నుండి రూ. 9.9 లక్షల వరకు

జీప్
జీప్ కంపాస్ – రూ. 2.16 లక్షలు
జీప్ మెరిడియన్ – రూ. 2.47 లక్షలు
జీప్ రాంగ్లర్ – రూ. 4.84 లక్షలు
జీప్ గ్రాండ్ చెరోకీ – రూ. 4.50 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది..

అయితే, ఆయా ప్రాంతాల్లోని షోరూమ్‌లను బట్టి కూడా పై రేట్లలో కొంత వరకు హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందంటున్నారు..

Exit mobile version