NTV Telugu Site icon

BattRE LOEV Plus Electric Scooter: మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 90KM రేంజ్

Batter

Batter

పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈవీ బైకులు, స్కూటర్లను కొనేందుకు వాహనదారులు ఇంట్రెస్ట్ చూపిస్తు్న్నారు. ఈ క్రమంలో ప్రముఖ టీవీలర్ తయారీ కంపెనీలన్నీ స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో లాంగ్ రేంజ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. జైపూర్ కు చెందిన BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ అర్భన్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ LOEV+ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జ్ తో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.

Also Read:Srisailam: శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులపై సుప్రీంకోర్టు తీర్పు..

BattRE LOEV Plus Electric Scooter ధర రూ. 69,999 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇది ఒకినావా రిడ్జ్ ప్లస్, ఓలా S1X లకు గట్టిపోటీనిస్తుంది.డిజైన్ పరంగా BattRE LOEV+ అనేక కట్స్, క్రీజ్‌లతో చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. దీనికి స్ప్లిట్ LED హెడ్‌లైట్ అమర్చారు. హ్యాండిల్ బార్ కౌల్ ఇంటిగ్రేటెడ్ DRL ని పొందుతుంది. LOEV+ ఐదు కలర్స్ లో లభిస్తుంది. స్టార్‌లైట్ బ్లూ, స్టార్మీ గ్రే, ఐస్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, పెర్ల్ వైట్.

Also Read:Bird Flu: బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాలు.. వాళ్లకు మాత్రం కాసుల వర్షం!

BattRE LOEV+ అమరాన్ 2kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు 13-amp ఛార్జర్‌ తో వస్తుంది. బ్యాటరీ, ఛార్జర్ రెండూ IP-67 రేటింగ్ కలిగి ఉంటాయి. BattRE బ్యాటరీ ప్యాక్, ఛార్జర్‌కు 3 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటల 50 నిమిషాలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 రైడ్ మోడ్‌లతో వస్తుంది. ఎకో, కంఫర్ట్ మరియు స్పోర్ట్. LOEV+ 35kmph గరిష్ట వేగంతో పాటు 90km రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో గంటకు 35 కిమీదూసుకు పోతే కంఫర్ట్ మోడ్ 48 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది. అయితే స్పోర్ట్స్ మోడ్‌లో గంటకు 60 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

Also Read:CM Chandrababu: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మిర్చి రైతులను ఆదుకోండి..

BattRE LOEV+ లో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీల కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్ సెటప్‌తో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించారు. LOEV+ స్కూటర్ 180mm గ్రౌండ్ క్లియరెన్స్‌ తో వస్తుంది. ఇది 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ తో వస్తుంది. క్రూయిజ్ కంట్రోల్, ఎల్ఈడీ ల్యాంప్స్ హిల్ హెల్డ్ అసిస్ట్, సీఏఎన్ -ఎనేబుల్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్, పార్కింగ్ మోడ్ వంటి ఫీచర్లను అందించారు.