Site icon NTV Telugu

350hp పవర్, రెట్రో లుక్ ప్రత్యేక డిజైన్‌తో Land Rover Defender 110 Trophy Edition లాంచ్..

Land Rover Defender 110 Trophy Edition

Land Rover Defender 110 Trophy Edition

Land Rover Defender 110 Trophy Edition: ల్యాండ్ రోవర్ తన లెజెండరీ ‘క్యామెల్ ట్రోఫీ’ వారసత్వాన్ని గుర్తు చేస్తూ.. డిఫెండర్ 110 ట్రోఫీ ఎడిషన్ (Defender 110 Trophy Edition) ను తాజాగా లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో అసలు క్యామెల్ ట్రోఫీ వాహనాల నుండి పొందిన డిజైన్ అంశాలు, ఫీచర్లు అందించారు. వాహనం ప్రత్యేక ఆఫ్ రోడ్ యాక్ససరీస్ తోపాటు రెట్రో థీమ్ పెయింట్ వర్క్ తో అందుబాటులో ఉంటుంది. ల్యాండ్ రోవర్ ప్రకారం ఈ SUV ధర రూ. 1.30 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

KantaraChapter1 : కాంతార చాప్టర్ 1 – ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ కష్టమే.. ఎంత రావాలంటే?

డిఫెండర్ 110 ట్రోఫీ ఎడిషన్‌లో 3.0-లీటర్ ఇన్‌లైన్-సిక్స్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 350hp శక్తి, 700Nm టార్క్ ఇస్తుంది. అలాగే ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గియర్‌బాక్స్‌తో కలసి, స్టాండర్డ్ ఫోర్-వీల్ డ్రైవ్ సౌకర్యం కూడా కలిగి ఉంది. ల్యాండ్ రోవర్ ప్రకారం ఈ SUV 0-100కిమీ/గం వేగాన్ని కేవలం 6.4 సెకన్లలో చేరగలదు. దీని గరిష్ట వేగం 191 కిమీ/గం మాత్రమే. డిజైన్ పరంగా.. డిఫెండర్ 110 ట్రోఫీ ఎడిషన్ ప్రామాణిక డిఫెండర్ సిల్యుయెట్‌ను కొనసాగిస్తుంది. అయితే కొత్తగా సాండ్ గ్లో యెల్లో, కేస్ విక్ గ్రీన్ బాహ్య రంగులు లభిస్తున్నాయి. రూఫ్, బోనెట్, స్కఫ్ ప్లేట్స్, సైడ్ క్లాడింగ్, వీల్ ఆర్చ్‌లపై కాన్ట్రాస్టింగ్ బ్లాక్ ఆక్సెంట్స్ ఉన్నాయి.

దీపావళికి ఆఫర్లే.. ఆఫర్లు.. Hyundai, Tata, Maruti Suzuki, Kia కార్లపై ఎంత డిస్కౌంట్ లభించనుందంటే..?

ఈ కొత్త కారుకు ప్రత్యేక 20 అంగుళాల గ్లాస్ బ్లాక్ అలోయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి ఆల్-సీజన్ లేదా ఆల్-టెరైన్ టైర్లుతో అందించబడతాయి. ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని పెంచడానికి హెవీ డ్యూటీ రూఫ్ రాక్, బ్లాక్ డిప్లాయబుల్ సైడ్ లాడర్, సైడ్ మౌంటెడ్ పానియర్స్, బ్లాక్ ఫినిష్డ్ స్నోర్కెల్ వంటి ఆప్షనల్ యాక్ససరీస్ ను కూడా అందించవచ్చు. అంతేకాకుండా, మ్యాట్ ప్రొటెక్టివ్ ఫిల్మ్ ను రెండు రంగులలో అమర్చే అవకాశం ఉంది. ఇంటీరియర్‌లో డిఫెండర్ 110 ట్రోఫీ ఎడిషన్ ఎబోనీ విండ్సర్ లెదర్ సీట్స్, ట్రోఫీ-బ్రాండెడ్ ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్స్, అలాగే ఎక్స్‌పోస్డ్ క్రాస్‌బీమ్‌ను బాహ్య రంగుతో ఫినిష్ చేసిన రూపంలో ప్రీమియం లుక్‌ను కొనసాగిస్తుంది. మొత్తానికి, డిఫెండర్ 110 ట్రోఫీ ఎడిషన్ అనేది ల్యాండ్ రోవర్ అభిమానుల కోసం హెరిటేజ్-ఇన్‌స్పైర్డ్, ఆఫ్-రోడ్ సామర్థ్యంతో కూడిన, ప్రీమియం SUV.

Exit mobile version