దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా ద్వారా అనేక అద్భుతమైన వాహనాలు భారత మార్కెట్లో విక్రయించబడుతున్న సంగతి తెలిసిందే.. కాగా.. ఇండియాలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే కంపెనీ మరో కొత్త వాహనాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వారమే కొత్త వాహనాన్ని లాంచ్ చేయనున్నారు. ఈ కొత్త కారులో ఎలాంటి ఫీచర్లను అందించనున్నారు.. ఇతర వివరాలను తెలుసుకుందాం………
కొత్త SUV లాంచ్:
కియా సిరోస్ ఎస్‌యూవీగా త్వరలో భారత మార్కెట్లోకి కొత్త వాహనం విడుదల కానుంది. కొత్త వాహనాన్ని ఈ గురువారం భారత్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ కారు అనేక గొప్ప ఫీచర్లతో పాటు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లతో ముందుకు రాబోతుంది. లాంచ్‌కు ముందు.. కంపెనీ సోషల్ మీడియాలో చాలా టీజర్‌లను విడుదల చేసింది. ఇందులో వాహనం డిజైన్, ఫీచర్ల గురించి చాలా సమాచారం ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన మరో టీజర్‌లో.. వాహనం యొక్క మరికొన్ని ఫీచర్ల గురించి సమాచారం బయటకు వచ్చింది. టీజర్‌లో LED లైట్లు, LED DRL, రూఫ్ రైల్, LED టెయిల్ లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్, సైడ్ ప్రొఫైల్ గురించిన సమాచారం ఉంది.
ఫీచర్లు:
ఇంతకుముందు విడుదల చేసిన టీజర్‌లో ఈ కారు బయటి భాగం నుండి ఇంటీరియర్ వరకు సమాచారం వెల్లడైంది. అలాగే.. ఈ కారు వెనుక సీటులో కూర్చుని ప్రయాణించే వారికి మరింత సౌకర్యాన్ని అందించే విధంగా తయారు చేశారు. అలాగే.. దీనికి సింగిల్ టోన్ ఇంటీరియర్ ఇవ్వవచ్చు. అంతేకాకుండా.. యాంబియంట్ లైట్లు, వెనుక AC వెంట్లు, ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, 360 డిగ్రీ కెమెరా, ADAS వంటి ఫీచర్లు అందించనున్నారు.
ఇంజిన్ శక్తి:
అధికారికంగా.. ఈ కారు ఇంజిన్ గురించి సమాచారం లాంచ్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఇందులో ఒక ఇంజన్ 1.2 లీటర్ కెపాసిటీతో ఉంటుంది. రెండవ ఇంజన్‌లో టర్బో ఆప్షన్ ఇవ్వనున్నారు.
పోటీ:
ఈ కారు భారత మార్కెట్లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. కియా సోనెట్, మహీంద్రా XUV 3XO, మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటి స్వంత కంపెనీకి చెందిన SUV లతో పోటీపడుతుంది.