Kia Seltos vs Honda Elevate: ప్రస్తుత కాలంలో మధ్య తరగతి ప్రజలు కూడా కార్లను కొనడానికి తెగ ఆరాట పడిపోతున్నారు. ఎలాగైనా సొంత కారు కొనాలని ఆలోచిస్తున్నారు. కారు కొనాలని ఆలోచిస్తున్నా.. ఎలాంటి కారు కొనాలి..? ఎలాంటి ఫీచర్స్ ఉండే కారులను ఎంపిక చేసుకోవాలి..? అనే విషయంపై చాలామంది సతమతమవుతున్నారు. ఇంకొందరు ఉన్నత వర్గాల వారు SUV కార్లను కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అనేక SUV కార్లు అందుబాటులో ఉన్నాయి. మరి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వారికి కొనే విధంగా ఉండేలా ఉన్న కార్లను ఒకసారి చూద్దాం. ఈ లిస్టులో కియా సేల్డోస్, హోండా ఎలివేట్ కారులను రెఫర్ చేయవచ్చు. అయితే, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే వివరణాత్మక తేడాలను ఒకసారి చూసేద్దాం. ఈ రెండు ఎస్‌యూవీలు భారత మార్కెట్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. అయితే వాటిలో ఏది బెటర్ అనేది ఫీచర్లు, ధరలు ఆధారంగా తేల్చుకోవచ్చు.
కంఫర్ట్ అండ్ సేఫ్టీ:
హోండా ఎలివేట్‌లో Level 2 ADAS సాంకేతికత అందుబాటులో ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్టు, వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా లేన్ వాచ్ అనే ప్రత్యేక కెమెరా టెక్నాలజీ అందుబాటులో ఉండడం హైలైట్. అలాగే 360 డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్టు, రియర్ వ్యూ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇక మరోవైపు కియా సెల్టోస్ లోనూ ADAS టెక్నాలజీ ఉంది. కానీ ఇది సెలెక్టెడ్ వెర్షన్‌లలో మాత్రమే లభిస్తుంది. సెల్టోస్‌లో ప్రత్యేకంగా వెంటిలేటెడ్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీటు, సౌండ్ మూడ్ ల్యాంప్స్, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి అధిక కంఫర్ట్ ఫీచర్లు లభిస్తున్నాయి. 8 అంగుళాల టచ్‌స్క్రీన్ (వైర్లెస్ Apple CarPlay/Android Auto), వాయిస్ కమాండ్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్, వైర్లెస్ ఛార్జింగ్, డ్రైవ్ మోడ్‌ల సౌలభ్యం ఉంది.
టెక్నాలజీ:
హోండా ఎలివేట్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హోండా కనెక్ట్, వాయిస్ అసిస్టెంట్లు, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్ ఉన్నాయి. అలాగే మరోవైపు కియా సెల్టోస్‌లో కూడా 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్, మొబైల్ యాప్ ద్వారా వెహికల్ నియంత్రణలు, OTA అప్డేట్స్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి.
ఇంజిన్:
హోండా ఎలివేట్ లో 1.5L i-VTEC పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. CVT లేదా మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంది. CVT వేరియంట్లలో ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి. ఇక కియా సెల్టోస్ లో వేరియంట్‌పై ఆధారపడి వివిధ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. వీటిలో 1.5L న్యాచురల్అస్పిరేటెడ్ పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్. IVT, DCT, మాన్యువల్, iMT లాంటి విభిన్న ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు లభిస్తాయి. సెల్టోస్ వెర్షన్లలో పెర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉంటుంది.
ధరలు :
ధరల పరంగా చూస్తే హోండా ఎలివేట్, కియా సెల్టోస్ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. హైదరాబాద్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుంటే, హోండా ఎలివేట్ ఎక్స్-షోరూమ్ ధరలు 11.99 లక్షల నుండి 16.73 లక్షల వరకు ఉన్నాయి. ఇక ఆన్-రోడ్ ధరలు అయితే.. 14.24 లక్షల నుండి 19.81 లక్షల వరకు ఉండగా, ఇది మొత్తం 9 వేరియంట్‌లలో లభ్యమవుతోంది.
Shubman Gill: అతడు ఓ అద్భుతం.. విజయానికి మేము అన్ని విధాలా ఆర్హులం!
మరోవైపు, కియా సెల్టోస్ ధరలు దాదాపు అదే లెవెల్ లో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్ ధరలు చూస్తే.. 11.19 లక్షల నుండి 20.56 లక్షల వరకు ఉంటే, ఆన్-రోడ్ ధరలు 13.05 లక్షల నుండి 24.23 లక్షల వరకు ఉన్నాయి. సెల్టోస్ మోడల్‌కి వేరియంట్ ఎంపికలు ఎక్కువగా లభ్యం కావడం వినియోగదారులకు మరింత వెరైటీని అందిస్తోంది. దీన్ని బట్టి బడ్జెట్ పరంగా చూడగలిగితే హోండా ఎలివేట్ కొంచెం తక్కువ పరిధిలో ఉండగా, సెల్టోస్ తక్కువ ప్రారంభ ధర నుంచి ఎక్కువ ఫీచర్లు ఉన్న టాప్ వేరియంట్ వరకు విస్తరిస్తుంది.
మొత్తంగా.. వీలైనంత సురక్షితంగా, మినిమల్ మెయింటెనెన్స్‌తో స్మార్ట్ SUV కావాలనుకునేవాళ్లకు హోండా ఎలివేట్ బెస్ట్ ఛాయిస్. అదే అధిక వేరియంట్ ఎంపికలు, డీజిల్ ఆప్షన్, వెరుగుతున్న ఫీచర్ రేంజ్ కావాలంటే కియా సెల్టోస్ ఉత్తమ ఎంపిక. ఇటు స్టైలిష్ డిజైన్, అటు హైటెక్ ఇంటీరియర్.. రెండింటినీ పరిశీలించి మీ అవసరాలను తగ్గట్టుగా నిర్ణయం తీసుకోండి.
