Kia Seltos 2026: కియా ఇండియా (Kia India) తన కొత్త జెనరేషన్ సెల్టాస్ SUVని భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై రూ.19.99 లక్షలు వరకు ఉంటుంది. ఈ కార్ ను డిసెంబర్ 11 నుంచి రూ. 25,000 టోకెన్ అమౌంట్ తో బుకింగ్ ప్రారంభం అయ్యింది. డెలివరీలు జనవరి మధ్యలో ప్రారంభమవుతాయి అని కంపెనీ ప్రకటించింది.
కియా ఇండియా 2026 మోడల్ కియా సెల్టాస్ SUVను భారత మార్కెట్లో ఐదు ప్రధాన ట్రిమ్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనం HTE, HTK, HTX, GTX, X-Line వేరియంట్లలో లభించనుంది. ఇందులో HTE బేస్ మోడల్‌గా, GTX టాప్-ఎండ్ వేరియంట్‌గా ఉంటుంది. ధరలు ఇంజిన్ ఆప్షన్‌లు, గేర్‌బాక్స్‌పై ఆధారపడి మారుతాయి.
ధరల విషయానికి వస్తే.. 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమై, HTX (A) వేరియంట్‌కు రూ.16.69 లక్షల వరకు ఉంది. అదే ఇంజిన్‌తో CVT ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.13.39 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు ఉన్నాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ iMT వేరియంట్ రూ.12.89 లక్షల నుంచి ప్రారంభమై HTK (O) వరకు అందుబాటులో ఉండగా.. టర్బో పెట్రోల్ DCT వేరియంట్ ధరలు రూ.16.29 లక్షల నుంచి టాప్ మోడల్‌లో రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి.
Jason Gillespie: అందుకే పాక్ జట్టు కోచ్‌గా తప్పుకున్న: జేసన్ గిలెస్పీ
డీజిల్ ఇంజిన్‌ను ఎంచుకునే వినియోగదారుల కోసం.. 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధరలు రూ.12.59 లక్షల నుంచి రూ.18.29 లక్షల వరకు ఉండగా, డీజిల్ ఆటోమేటిక్ (AT) వేరియంట్ ధరలు రూ.14.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలుగా కంపెనీ వెల్లడించింది.
