Site icon NTV Telugu

రూ.12.54 లక్షలకే సన్‌రూఫ్ ఉన్న Kia Carens Clavis HTE (EX).. ప్రీమియం ఫీచర్లు ఇవే!

Kia

Kia

Kia Carens Clavis HTE (EX): కియా ఇండియా తన కారెన్స్ క్లావిస్ (ICE) లైనప్‌లో కొత్తగా HTE (EX) ట్రిమ్‌ను అధికారికంగా విడుదల చేసింది. ధరలతో పాటు ప్రీమియం ఫీచర్లను అందిస్తూ ఈ కొత్త వేరియంట్ మార్కెట్‌లోకి వచ్చింది. ఫీచర్ల పరంగా మెరుగైన విలువను అందించడమే లక్ష్యంగా ఈ ట్రిమ్‌ను కియా సంస్థ రూపొందించింది.

HTE (EX) ట్రిమ్ ధరలు:
* G1.5 పెట్రోల్ వేరియంట్: రూ.12,54,900 (ఎక్స్-షోరూమ్)
* G1.5 టర్బో పెట్రోల్ వేరియంట్: రూ.13,41,900 (ఎక్స్-షోరూమ్)
* D1.5 డీజిల్ వేరియంట్: రూ.14,52,900 (ఎక్స్-షోరూమ్)

Read Also: US-Iran: ఇరాన్‌లో ఏం జరుగుతోంది?.. టెహ్రాన్ దిశగా వెళ్తోన్న అత్యంత శక్తివంతమైన యూఎస్ నౌకలు

ఇక, ఫీచర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ధరలను అందుబాటులో ఉంచడంపై కియా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఈ కొత్త ట్రిమ్ స్పష్టంగా చూపిస్తోంది. కస్టమర్ల నుంచి వచ్చిన అభిప్రాయాలు, మారుతున్న మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ వేరియంట్‌ను అభివృద్ధి చేసినట్లు కియా వెల్లడించింది. కాగా, కొత్తగా ప్రవేశ పెట్టిన HTE (EX) ట్రిమ్ అన్ని ICE పవర్‌ట్రెయిన్‌లలో.. G1.5 పెట్రోల్, G1.5 టర్బో పెట్రోల్, D1.5 డీజిల్- అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్‌ను 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా, కారెన్స్ క్లావిస్ G1.5 పెట్రోల్ పవర్‌ ట్రెయిన్‌లో తొలిసారిగా సన్‌రూఫ్‌ను అందించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Read Also: Fastag Rules: వాహనదారులకు అలర్ట్.. ఇకపై అలా కుదరదు..!

అయితే, ఈ కారు లాంచ్‌పై కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అటుల్ సూద్ మాట్లాడుతూ.. మా కస్టమర్ల వల్లే కారెన్స్ క్లావిస్ (ICE) శ్రేణిలో HTE (EX) ట్రిమ్‌ను పరిచయం చేయడం జరుగుతుందన్నారు. వారు ఎక్కువగా కోరుకునే సౌకర్యాలు, ఫీచర్లు, ముఖ్యంగా G1.5 పవర్‌ట్రెయిన్‌లో తొలిసారిగా స్కైలైట్ సన్‌రూఫ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కారెన్స్ క్లావిస్‌ కారు కుటుంబాలకు మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మార్చుతుందని తెలిపారు. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కియా స్థాయిని మరింత బలోపేతం చేస్తుందని వెల్లడించారు.

Read Also: రూ. 8,999కే TECNO Spark Go 3 భారత్‌లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, IP64 రేటింగ్‌తో బడ్జెట్ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్..!

కాగా, కియా కారెన్స్ క్లావిస్ HTE (EX) వేరియంట్‌లో అనేక ప్రీమియం సౌకర్యాలను కంపెనీ జోడించింది.
* స్కైలైట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (G1.5 పవర్‌ట్రెయిన్‌లో తొలిసారి),
* పూర్తిగా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ (FATC),
* LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, పొజిషన్ ల్యాంప్స్,
* LED క్యాబిన్ లైట్స్,
* డ్రైవర్ సైడ్ ఆటో అప్/డౌన్ పవర్ విండో వంటి ఫీచర్లు

ఈ అదనపు ఫీచర్లతో క్యాబిన్‌లో మరింత విశాలం, సౌకర్యం, భద్రతను అందించడమే కాకుండా, కార్ ఎక్స్‌టీరియర్‌కు ప్రీమియం లుక్‌ను కూడా కియా అందిస్తోంది. HTE (EX) వెరియంట్ ఎంట్రీతో కియా ఇండియా కారెన్స్ క్లావిస్ (ICE) లైనప్‌ను మరింత బలోపేతం చేస్తోంది. డిజైన్, టెక్నాలజీ, ప్రాక్టికాలిటీని సమన్వయపరిచిన ఉత్పత్తులను కస్టమర్ అవసరాలకు అనుగుణంగా అందించడమే తమ లక్ష్యమని కియా మరోసారి స్పష్టం చేసింది.

Exit mobile version