KIA Carens Clavis EV HTK Plus.. ఒకసారి ఛార్జ్ చేస్తే 404 కి.మీ, కేవలం 4 గంటల్లో ఫుల్ ఛార్జింగ్
- ఎలక్ట్రిక్ MPV సెగ్మెంట్‌లో మరో ముందడుగు వేసిన కియా..
- ఒకసారి పూర్తిస్థాయిలో ఛార్జింగ్ చేస్తే 404 కిలో మీటర్ల ARAI రేంజ్..
- 11kW AC ఛార్జర్‌తో 4 గంటల్లో ఫుల్ ఛార్జ్, 6 ఎయిర్‌బ్యాగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kia Carens Clavis EV HTK Plus: కియా ఇండియా తన ఎలక్ట్రిక్ MPV సెగ్మెంట్‌లో మరో ముందడుగు వేసింది. Kia Carens Clavis EVలో బేస్ వేరియంట్‌గా HTK Plusను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.17.99 లక్షలు (ఎక్స్–షోరూమ్)గా ఉండొచ్చని తెలుస్తుంది. HTK Plus వేరియంట్‌లో 42 kWh బ్యాటరీ ప్యాక్ ను అందిస్తుండగా, ఇది ఒకసారి ఛార్జ్‌తో 404 కిలో మీటర్ల ARAI రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 133 bhp పవర్, 255 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read
- Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
- Bike Shock Absorbers: బైక్ షాక్ అబ్జార్బర్లు ఎంతకాలం పనిచేస్తాయి? ఎప్పుడు మార్చాలి? ఖర్చు ఎంత?
- Best Bikes: బడ్జెట్ ధరలో.. రోజువారీ ప్రయాణానికి బెస్ట్ బైక్స్..
- Porsche 911 GT3: భారత్ లో పోర్షే 911 GT3 విడుదల.. 311 km/h, 503 bhp పవర్.. ధర ఎంతంటే?
అయితే, కొత్త EV కొనుగోలుదారుల ఛార్జింగ్ ఆందోళనలను తగ్గించేందుకు 11kW AC ఛార్జర్‌తో 4 గంటల్లో ఫుల్ ఛార్జ్, అలాగే 100kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10 శాతం నుంచి 80 శాతాన్ని 39 నిమిషాల్లో ఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని కియా అందజేస్తుంది. భద్రత విషయంలోనూ ఈ బేస్ మోడల్ ఆకట్టుకుంటోంది. 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్, ABS, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, TPMS, ఆల్–ఫోర్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఇందులో చేర్చింది. ఇక, లుక్ పరంగా స్టార్ మ్యాప్ LED DRLs, ఐస్- క్యూబ్ LED హెడ్‌ల్యాంప్స్, 16- ఇంచ్ ఏరో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెనా వంటి డిజైన్ ఇందులో హైలైట్ గా నిలిచాయి.
ఇక, ఇంటీరియర్‌లో బ్లాక్- బేజ్ డ్యుయల్ టోన్ క్యాబిన్, 2nd & 3rd రోలకు రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్, 8- ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ Android Auto/ Apple Car Play, 5 USB Type-C పోర్ట్స్, i-Pedal, రీజెన్ కంట్రోల్ ప్యాడిల్ షిఫ్టర్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. లగ్జరీ ఫీచర్లు తక్కువగా ఉన్నా.. రేంజ్, భద్రత, ఫ్యామిలీ స్పేస్, ప్రాక్టికల్ పనితీరుతో విలువకు పెద్దపీట వేసిన EVగా HTK Plus నిలుస్తుందని ఆటో మొబైల్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎయిర్‌బ్యాగ్స్..
* ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
* ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్)
* హిల్ స్టార్ట్ అసిస్ట్
* TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్)
* ఆల్–ఫోర్ డిస్క్ బ్రేక్స్
ఎక్స్‌టీరియర్ ఫీచర్లు
* Star Map LED DRLs
* Ice Cube LED హెడ్‌ల్యాంప్స్ (Welcome ఫంక్షన్‌తో)
* 16–ఇంచ్ Glossy Aero Alloy వీల్స్
* Roof Rails
* Shark Fin Antenna
ఇంటీరియర్ & సౌకర్యాలు
* 2nd & 3rd రోలకు రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్
* 5 USB Type-C ఛార్జింగ్ పోర్ట్స్
* 4.2-ఇంచ్ MIDతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
* 8-ఇంచ్ Touchscreen Infotainment
* Wireless Android Auto & Apple CarPlay
* Regenerative Braking Controlకు Paddle Shifters
* i-Pedal & i-Pedal Driving Mode
* i-Pedalలో One-Pedal Driving సపోర్ట్
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!