Keeway Hypvolt-R: భారత్‌లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
- హైప్‌వోల్ట్-ఆర్ (Hypvolt-R) ఎలక్ట్రిక్ స్కూటర్
- 180KM రేంజ్
- ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కీవే (Keeway) భారత మార్కెట్లో కొత్త హైప్‌వోల్ట్-ఆర్ (Hypvolt-R) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన మోటార్, 180 కిలోమీటర్ల వరకు రేంజ్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఈ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.
ధర, బుకింగ్ వివరాలు
కీవే హైప్‌వోల్ట్-ఆర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ.5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
శక్తివంతమైన మోటార్.. 180 కిలోమీటర్ల రేంజ్
ఈ స్కూటర్లో 12 kW సామర్థ్యం గల పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ను అమర్చారు. కంపెనీ ప్రకారం, ఇది కేవలం 2.3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ/గంట వేగాన్ని అందుకుంటుందని తెలిపారు. ఇందులో డ్యూయల్ 5 kWh రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ బ్యాటరీతో IDC సర్టిఫైడ్ 180 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే స్కూటర్ గరిష్ట వేగం 115 కిమీ/గంట వరకు ఉంటుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం
బ్యాటరీలను స్కూటర్లోపల లేదా బయట కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. స్కూటర్లోనే ఛార్జ్ చేస్తే 0 నుంచి 80 శాతం వరకు సుమారు 3 గంటల్లో ఛార్జ్ అవుతుంది.
అధునాతన ఫీచర్లతో ప్రీమియం అనుభవం
కీవే హైప్‌వోల్ట్-ఆర్ లో పలు ఆధునిక ఫీచర్లను అందించారు. వాటిలో:
ప్రొజెక్టర్ LED హెడ్లైట్లు
ఫుల్-విడ్త్ LED లైట్ బార్
బ్లూటూత్ కనెక్టివిటీతో 5-అంగుళాల TFT డిస్ప్లే
ఎకో, నార్మల్, స్పోర్ట్ రైడింగ్ మోడ్లు
రివర్స్ మోడ్
USB Type-A, Type-C ఛార్జింగ్ పోర్టులు
సీటు కింద 27 లీటర్ల స్టోరేజ్ స్పేస్
భద్రతకు పెద్దపీట
భద్రత పరంగా కూడా ఈ స్కూటర్లో అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
డ్యూయల్-ఛానల్ ABS
ట్రాక్షన్ కంట్రోల్
హిల్ హోల్డ్ కంట్రోల్
హిల్ డిసెంట్ కంట్రోల్
క్రూయిజ్ కంట్రోల్
బ్లైండ్ స్పాట్ డిటెక్షన్
రియర్ రివర్స్ కెమెరా
డిజైన్, కలర్ ఆప్షన్లు
హైప్‌వోల్ట్-ఆర్ ఆకర్షణీయమైన ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో వస్తోంది. క్రిస్టల్ వైట్, ప్లాటినం గ్రే అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు అందించారు. అలాగే 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు 100/80, వెనుక 120/70 టైర్లతో పాటు 130 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు, 180 కిలోమీటర్ల రేంజ్, ఆధునిక భద్రతా సదుపాయాలతో కీవే హైప్‌వోల్ట్-ఆర్ భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ప్రీమియం ఈవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!