January Car sales: జనవరిలో దుమ్మురేపిన నెక్సాన్.. అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే..
- జనవరిలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నెక్సాన్..
- టాప్-10లో కొనసాగిన మారుతీ సుజుకీ ఆధిపత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
January Car sales: 2026 తొలి నెలలో టాటా నెక్సాన్ అమ్మకాల్లో దుమ్ము రేపింది. జనవరి నెలలో టాప్-1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వినియోగదారుల ట్రెండ్ గమనిస్తే.. ఎక్కువ మంది SUVలు, కాంపాక్ట్ ఫ్యామిలీ కార్ల కొనుగోలకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. జనవరి నెలలో టాటా నెక్సాన్ ఏకంగా 23,365 యూనిట్లు అమ్ముడయ్యాయి. తొలి నెల కార్ సేల్స్‌లో టాప్ స్థానంలో ఉంది. నెక్సాన్‌లో అనేక ఆప్షన్లు ఉండటం, డిజిల్-పెట్రోల్‌లో అందుబాటులో ఉండటం, మంచి ఫీచర్లు, పలు ఇంజన్ ఆప్షన్లు ఉండటం బలంగా మారాయి.
రెండో స్థానంలో మారుతి సుజుకీ డిజైర్ (19,629 యూనిట్లు) నిలిచింది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో ఇప్పటికీ ఈ కార్‌కు మంచి క్రేజ్ ఉంది. టాప్-3లో టాటా పంచ్ 19,257 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది. ఇప్పటి వరకు పంచ్ 7 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడవ్వడం ఈ కార్ విజయానికి నిదర్శనం. నాలుగో స్థానంలో హ్యుందాయ్ క్రేటా 17,921 యూనిట్లతో ఉంది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. జనవరి నెలలో ఎక్కువైన బ్రాండ్‌గా మారుతి సుజుకీ నిలిచింది. ఈ సంస్థకు చెందిన 6 మోడళ్లు టాప్-10 లిస్టులో ఉన్నాయి.
Also Read
- Kia Sorento: కియా సోరెంటో ఎస్యూవీ కొత్త టీజర్ విడుదల.. ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం, లాంచ్‌కు సిద్ధమైన కియా
- Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
- Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న ఫీచర్లు ఇవే!
- Toyota Fortuner: పెట్రోల్, డీజిల్‌కు గుడ్ బై.. 100% ఇథనాల్‌తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
Read Also: DDC 0001 Number Plate: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు.. సొంతం చేసుకున్న తెలుగోడు!
జనవరి 2026 టాప్-10 అమ్ముడైన కార్లు:
1.టాటా నెక్సన్ – 23,365
2.మారుతి సుజుకి డిజైర్ – 19,629
3.టాటా పంచ్ – 19,257
4.హ్యుందాయ్ క్రెటా – 17,921
5.మారుతీ సుజుకి ఎర్టిగా – 17,829
6.మారుతి సుజుకి స్విఫ్ట్ – 17,806
7.మారుతీ సుజుకి బ్రెజ్జా – 17,486
8.మారుతీ సుజుకి బాలెనో – 16,782
9.మహీంద్రా స్కార్పియో – 15,542
10.మారుతీ సుజుకి విక్టరీ – 15,240
బ్రాండ్‌ల పరంగా చూస్తే మారుతీ సుజుకి బ్రాండ్ కార్లు జనవరి నెలలో 2,36,962 యూనిట్లు అమ్ముడయ్యాయి. టాటా మోటార్స్ కార్‌లు 71,066 యూనిట్లతో రెండో స్థానంలో ఉంది. మహీంద్రా 63,510 కార్లను విక్రయించింది. హ్యుందాయ్ 59,107 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!