NTV Telugu Site icon

January 2025 Sales: జనవరిలో దుమ్ములేపిన మారుతి సుజుకి, కియా, టయోటా

Maruti Suzuki, Kia,

Maruti Suzuki, Kia,

January 2025 Sales: 2025 మొదటి నెల జనవరిలో కియా, మారుతి సుజుకి, టయోటా కంపెనీలు సత్తా చాటాయి. ఇతర కార్ మేకర్లతో పోలిస్తే మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి.

కియా:

కియా తన సోనెట్, కొత్తగా తీసుకువచ్చిన సైరోస్‌తో అమ్మకాలను పెంచుకుంది. జనవరి నెలలో మొత్తంగా కియా 25,025 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఒక్క కియా సైరోస్.. జనవరి 2025లో 5,546 యూనిట్లను విక్రయించడం ద్వారా దక్షిణ కొరియా బ్రాండ్‌ మంచి ఓపెనింగ్ సొంతం చేసుకుంది. 2024 జనవరి అమ్మకాలు (23,769) అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది తొలి నెలలో 5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

కొత్తగా కియా సైరోస్‌ని ఇటీవల రిలీజ్ చేసింది. దీని ధర రూ. 8.99 లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. ఇది సబ్-4 కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ ప్రత్యర్థిగా ఉంది.

మారుతి సుజుకీ:

దేశంలో అతిపెద్ద కార్ మాన్యుఫ్యాక్చర్ మారుతీ సుజుకీ జనవరి అమ్మకాల్లో దుమ్మురేపింది. గతేడాదితో పోలిస్తే 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. జనవరి 2025లో మొత్తంగా 1,73,599 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది, ఇది జనవరి 2024లో అమ్ముడైన 1,66,802 యూనిట్లతో పోలిస్తే 4 శాతం ఎక్కువ. వ్యాగన్ ఆర్, బాలెనో, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, డిజైర్ వంటి మోడళ్లు 82,241 యూనిట్లలో మారుతీ సుజుకీ సేల్స్‌ని పెంచాయి. ఇదిలా ఉంటే మినీ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్‌లో మాత్రం అమ్మకాలు క్షీణించాయి. ఆల్టో ఎస్ ప్రెస్సో మోడళ్ల అమ్మకాలు 11 శాతం తగ్గాయి. సెడాన్ సియాజ్ 768 యూనిట్లు అమ్మకాలను నమోదు చేసింది.

ఇటీవల కాలంలో మారుతీ సుజుకీ నుంచి ఎస్‌యూవీ కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఫలితంగా, బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, జిమ్నీ, ఇన్విక్టో, గ్రాండ్ విటారా మరియు XL6 వంటి వాహనాలు 65,093 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇది గత నెలలో పోలిస్తే 5 శాతం ఎక్కువ.

టయటా కిర్లోస్కర్:

2025లో తొలిమాసం అమ్మకాల్లో టయోటా 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ జనవరి 2024లో 24,609 యూనిట్లను విక్రయించింది మరియు ఇప్పుడు మొత్తం అమ్మకాలు జనవరి 2025లో 29,371 యూనిట్ల అమ్మకాలకు పెరిగాయి. అంటే వార్షిక వృద్ధి రేటు19 శాతం పెరిగింది. 29,371 యూనిట్లలో, టయోటా భారతదేశంలో 26,178 యూనిట్లను విక్రయించింది , మిగిలిన 3,193 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.

భారతదేశంలో టయోటా అత్యధికంగా అమ్ముడైన కార్లలో.. టయోటా ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, టయోటా గ్లాంజా, టైసర్, టయోటా ఫార్చ్యూనర్, హిలక్స్, కామ్రీ మరియు టయోటా విల్‌ఫైర్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వరసగా 5వ ఏడాది కూడా అమ్మకాలపరంగా అగ్రస్థానంలో ఉంది.