NTV Telugu Site icon

Year Ender 2024: ఈ ఏడాది మార్కెట్‌ను ఊపు ఊపిన కార్లు ఇవే..

Indian Automobile Sector

Indian Automobile Sector

మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం ఎన్నో కొత్త మైలురాళ్లను సాధించింది. కంపెనీలు అనేక కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ ఏడాది విడుదలైన కొన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్ల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. కొన్ని కార్ మోడల్‌లు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. అవి మునుపటి కంటే సురక్షితంగా మారాయి. అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం…

ఈ ఏడాదిలో వచ్చిన కొత్త ఈవీ కార్లు..
టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కారు టాటా పంచ్‌ను ఎలక్ట్రిక్ అవతార్‌లో ఈ ఏడాది 17 జనవరి 2024న మార్కెట్లో విడుదల చేసింది. టాటా మోటార్స్ తన మరో కొత్త ఎలక్ట్రిక్ కారు టాటా కర్వ్ ఈవీని కూడా పరిచయం చేసింది. తర్వాత ఈ కారు పెట్రోల్ వెర్షన్ కూడా లాంచ్ అయింది. ఇది కాకుండా.. ఆల్-ఎలక్ట్రిక్ కారు రోల్స్ రాయిస్ స్పెక్టర్ కూడా ఈ సంవత్సరం ప్రారంభించారు. BYD సీల్, BMW i5 M60 XDrive, Porsche Macan EV, Mercedes-Benz EQA, Mercedes-Benz EQB ఫేస్‌లిఫ్ట్, MG విండ్సర్ EV, Kia EV9, BYD eMax7, మహీంద్రా BE 6, మహీంద్రా కార్లు కూడా ఈ సంవత్సరం విడుదలయ్యాయి.

మారుతి సుజుకి డిజైర్..
మారుతి సుజుకి యొక్క మిడ్-సైజ్ సెడాన్ డిజైర్ కి చెందిన కొత్త ఎడిషన్ ఈ సంవత్సరం ఓ ఊపు ఊపింది. ఈ కారు డిజైన్‌ తో పాటు మంచి సెఫ్టీ రేటింగ్‌ని కూడా అందించింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గ్లోబల్ NCAP నుంచి కారు భద్రత పరంగా మొదటిసారిగా 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారు పరిచయంతో కంపెనీ మార్కెట్లో పోటీని మరింత పెంచింది. అయితే.. మరోవైపు హోండా అమేజ్ కూడా కొత్త ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది.

మహీంద్రా థార్ రాక్స్..
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న.. ఐదు-డోర్ల మహీంద్రా థార్ రాక్స్ 15 ఆగస్టు 2024న ప్రారంభించారు. మహీంద్రా థార్ రాక్స్ కూడా పలు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ రూ. 12.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్‌కు ₹ 22.49 లక్షల వరకు ఉంది. ఈ కారు దాదాపు 18 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని బేస్ మోడల్ MX1 RWD, టాప్ మోడల్ మహీంద్రా థార్ ROXX AX7L 4WD డీజిల్ AT.

Show comments