Hyundai Exter: దుమ్మురేపే ఫీచర్లతో హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త వేరియంట్స్.. ధర ఎంతంటే?
- హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త వేరియంట్లు
- ఎక్స్‌టార్ కొత్త వేరియంట్స్ SX Tech, S+, S
- కొత్త వేరియంట్ల ధర రూ. 7.73 లక్షల నుంచి ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ కొరియా దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తోంది. హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెహికల్స్ కు మంచి డిమాండ్ ఉంటోంది. ఇటీవల కంపెనీ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను ఎంట్రీ లెవల్ SUVగా రిలీజ్ చేసింది. ఇటీవల ఈ SUV యొక్క కొత్త వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫీచర్ అప్ గ్రేడ్ లతో ఎక్స్‌టార్ కొత్త వేరియంట్స్ SX Tech, S+, S లను తీసుకొచ్చింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త వేరియంట్స్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read:Mamta Kulkarni: సన్యాసిగా మారిన మాజీ నటి మమతా కులకర్ణి సంచలన నిర్ణయం..
Also Read
- Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
- 890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
- KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
హ్యుందాయ్ ఎక్స్‌టర్ SX టెక్ వేరియంట్‌లో అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చింది. ఇది స్మార్ట్ కీతో పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, డాష్‌క్యామ్‌తో డ్యూయల్ కెమెరా, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, పూర్తి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోలర్ తో డిజిటల్ డిస్‌ప్లే, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో బై-ఫంక్షన్ కలిగి ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ S+ వేరియంట్ స్మార్ట్ సన్‌రూఫ్, డ్యూయల్-టోన్ స్టైల్‌తో 15-అంగుళాల స్టీల్ వీల్స్, గైడ్‌లైన్స్‌తో రియర్ కెమెరా, ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, రియర్ AC వెంట్స్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌తో వస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ SUV S వేరియంట్‌కు అనేక ఫీచర్లు యాడ్ చేశారు. ఇది స్టాటిక్ గైడ్ లైన్స్ తో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, 15-అంగుళాల డ్యూయల్ టోన్ స్టీల్ రిమ్స్, ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి లక్షణాలను కలిగి ఉంది.
Also Read:Bunny Vasu: కేసు ఫైల్ అయితే, వెనక్కి తీసుకోలేము..జాగ్రత్త !
ధర ఎంత?
హ్యుందాయ్ ఎక్స్‌టార్ యొక్క S మాన్యువల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.73 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. దీని S+ వేరియంట్‌ను రూ. 7.93 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. S AMT ధర రూ. 8.43 లక్షలు (ఎక్స్-షోరూమ్), SX Tech MT ధర రూ. 8.51 లక్షలు (ఎక్స్-షోరూమ్), S+ AMT ధర రూ. 8.63 లక్షలు (ఎక్స్-షోరూమ్), S ఎగ్జిక్యూటివ్ CNG వేరియంట్ ధర రూ. 8.64 లక్షలు (ఎక్స్-షోరూమ్), S+ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ. 8.85 లక్షలు (ఎక్స్-షోరూమ్), SX Tech AMT ధర రూ. 9.18 లక్షలు (ఎక్స్-షోరూమ్), SX Tech MT ధర CNG వేరియంట్ ధర రూ. 9.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!