NTV Telugu Site icon

Hyundai Exter: దుమ్మురేపే ఫీచర్లతో హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త వేరియంట్స్.. ధర ఎంతంటే?

Exter

Exter

సౌత్ కొరియా దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తోంది. హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెహికల్స్ కు మంచి డిమాండ్ ఉంటోంది. ఇటీవల కంపెనీ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను ఎంట్రీ లెవల్ SUVగా రిలీజ్ చేసింది. ఇటీవల ఈ SUV యొక్క కొత్త వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫీచర్ అప్ గ్రేడ్ లతో ఎక్స్‌టార్‌ కొత్త వేరియంట్స్ SX Tech, S+, S లను తీసుకొచ్చింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త వేరియంట్స్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Also Read:Mamta Kulkarni: సన్యాసిగా మారిన మాజీ నటి మమతా కులకర్ణి సంచలన నిర్ణయం..

హ్యుందాయ్ ఎక్స్‌టర్ SX టెక్ వేరియంట్‌లో అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చింది. ఇది స్మార్ట్ కీతో పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, డాష్‌క్యామ్‌తో డ్యూయల్ కెమెరా, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, పూర్తి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోలర్ తో డిజిటల్ డిస్‌ప్లే, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో బై-ఫంక్షన్ కలిగి ఉంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ S+ వేరియంట్ స్మార్ట్ సన్‌రూఫ్, డ్యూయల్-టోన్ స్టైల్‌తో 15-అంగుళాల స్టీల్ వీల్స్, గైడ్‌లైన్స్‌తో రియర్ కెమెరా, ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, రియర్ AC వెంట్స్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌తో వస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ SUV S వేరియంట్‌కు అనేక ఫీచర్లు యాడ్ చేశారు. ఇది స్టాటిక్ గైడ్ లైన్స్ తో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, 15-అంగుళాల డ్యూయల్ టోన్ స్టీల్ రిమ్స్, ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి లక్షణాలను కలిగి ఉంది.

Also Read:Bunny Vasu: కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము..జాగ్రత్త !

ధర ఎంత?

హ్యుందాయ్ ఎక్స్‌టార్ యొక్క S మాన్యువల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.73 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. దీని S+ వేరియంట్‌ను రూ. 7.93 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. S AMT ధర రూ. 8.43 లక్షలు (ఎక్స్-షోరూమ్), SX Tech MT ధర రూ. 8.51 లక్షలు (ఎక్స్-షోరూమ్), S+ AMT ధర రూ. 8.63 లక్షలు (ఎక్స్-షోరూమ్), S ఎగ్జిక్యూటివ్ CNG వేరియంట్ ధర రూ. 8.64 లక్షలు (ఎక్స్-షోరూమ్), S+ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ. 8.85 లక్షలు (ఎక్స్-షోరూమ్), SX Tech AMT ధర రూ. 9.18 లక్షలు (ఎక్స్-షోరూమ్), SX Tech MT ధర CNG వేరియంట్ ధర రూ. 9.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.