Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ-2025 బుకింగ్స్ ప్రారంభం, నవంబర్ 4న లాంచింగ్..
- హ్యుందాయ్ కొత్త వెన్యూ బుకింగ్స్ ప్రారంభం..
- సరికొత్త స్టైల్లో రాబోతున్న వెన్యూ..
- బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Venue: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన కొత్త వెన్యూ(Venue) కోసం బుకింగ్ ప్రారంభించింది. ఆల్ న్యూ వెన్యూ సరికొత్త డిజైన్, స్టైల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మార్పులతో రాబోతోంది. కొత్త వెన్యూ నవంబర్ 04న అధికారికంగా లాంచ్ కాబోతోంది. దీంతో, కస్టమర్ల కోసం హ్యుందాయ్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. కస్టమర్లు హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా రూ. 25,000 చెల్లించి కొత్త వెన్యూను రిజర్వ్ చేసుకోవచ్చు. కొత్తగా వస్తున్న వెన్యూ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వస్తోంది.
కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం, కొత్త వెన్యూ పొడవు, వెడల్పులు పెరుగుతున్నాయి. పాత మోడల్‌తో పోలిస్తే లాంగ్ వీల్ బేస్ కలిగి ఉంటుంది. క్యాబిన్ స్పేస్ కారును మరింత సౌకర్యవంతంగా మార్చనుంది. కొత్త వెన్యూ కొలతల్ని పరిశీలిస్తే.. 3,995 మిమీ పొడవు, 1,800 మిమీ వెడల్పు మరియు 1,665 మిమీ ఎత్తు, వీల్‌బేస్ 2,520 మిమీగా ఉండబోతోంది. గతంలో పోలిస్తే వీల్ బేస్ 20మిమీ ఎక్కువ.
Also Read
- Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
- Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
- Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
- భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
Read Also: Khyber Pakhtunkhwa: పాక్ చేతుల్లొంచి జారిపోతున్న ఖైబర్ పఖ్తుంఖ్వా ? .. దాయాది దేశంలో ఏం జరుగుతుంది!
డిజైన్ మార్పులలో డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, క్వాడ్-బీమ్ LED హెడ్‌ల్యాంప్‌లు, ట్విన్ LED DRLలు, హోరిజోన్-స్టైల్ LED టెయిల్ లాంప్లు, 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉండబోతోంది. 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ క్యాబిన్‌కు మరింత అందాన్ని తీసుకురాబోతోంది. క్యాబిన్ డార్క్ నేవీ, డవ్ గ్రే రంగులలో డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. ర్రాజో-టెక్చర్డ్ డాష్‌బోర్డ్, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. 2-స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, రియర్ విండో సన్షేడ్లు, ఫోర్-వే పవర్ డ్రైవర్ సీటు కలిగి ఉంటుంది.
ఇంజన్ల విషయానికి వస్తే 1.2-లీటర్ కప్పా పెట్రోల్, 1.0-లీటర్ టర్బో GDi పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ వేరియంట్లు ఉంటాయి. మాన్యువల్, ఆటోమేటిక్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్లు కలిగి ఉంటుంది. 2025 హ్యుందాయ్ వెన్యూ ఆరు మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లను అందుబాటులో ఉంటుంది. కొత్త హ్యుందాయ్ వెన్యూ టాటా నెక్సాన్, మహీంద్రా 3XO, కియా సోనెట్‌కి పోటీ ఇస్తుంది.
తాజావార్తలు
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!