Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
- Hyundai కార్లలో భారీ అప్డేట్
- మూడు SUVలకు కొత్త Lounge Edition
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Creta Electric Lounge Edition: భారత మార్కెట్లో SUVలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో Hyundai మరో కీలక అప్డేట్ను తీసుకొచ్చింది. కంపెనీ ఒకేసారి తన మూడు ప్రముఖ SUVలకు Lounge Editionను పరిచయం చేసింది. ఇందులో Hyundai Creta, Hyundai Alcazar, Creta Electric ఉన్నాయి. కొత్త Lounge Editionలో ప్రీమియం ఫీచర్లు, ప్రత్యేక ఇంటీరియర్ డిజైన్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ వంటి అదనపు సౌకర్యాలను అందించారు. ఈ మూడు SUVల ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మూడు SUVలకు Lounge Edition
Hyundai తన Creta, Alcazar, Creta Electric మోడళ్లలో Lounge Editionను అందిస్తోంది. ముఖ్యంగా వెనుక సీట్లలో ప్రయాణించే వారికి మరింత ప్రీమియం, ఎంటర్టైన్మెంట్ ఆధారిత అనుభవాన్ని అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. ఈ ఎడిషన్‌లో కొన్ని మోడళ్లకు ప్రత్యేక రంగులు, కొత్త సీటు డిజైన్, అంబియంట్ లైటింగ్, రియర్ స్క్రీన్ వంటి ఫీచర్లను జోడించారు.
Also Read
- BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
- World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
- Jawa 42 All Stars Edition: జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్ బైక్ లాంచ్.. 27.1hp పవర్, డ్యూయల్ ఛానల్ ABS, ధర ఎంతంటే?
- ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
Hyundai Creta Lounge Edition ఫీచర్లు
Creta Lounge Editionను King ట్రిమ్ ఆధారంగా రూపొందించారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా 11.6 అంగుళాల రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్క్రీన్ ద్వారా వెనుక సీటులో ఉన్న ప్రయాణికులు వీడియో స్ట్రీమింగ్, OTT కంటెంట్, గేమింగ్, ఫోన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు Bose 8-స్పీకర్, ఆడియో సిస్టమ్, ప్రత్యేక Lounge ఇంటీరియర్ థీమ్, ప్రీమియం సీట్ డిజైన్, అంబియంట్ లైటింగ్, 11.6-అంగుళాల రియర్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Creta Lounge Edition ఇంజిన్
Creta Lounge Editionలో 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజిన్‌తో iVT ఆప్షన్, అలాగే 1.5 లీటర్ U2 CRDi డీజిల్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందిస్తున్నారు.
Creta Lounge Edition ధర
ప్రారంభ ధర: రూ.19.21 లక్షలు
టాప్ వేరియంట్: రూ.20.45 లక్షలు
ధరలు: ఎక్స్-షోరూమ్
Hyundai Alcazar Lounge Edition
Alcazar Lounge Editionలో కూడా ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పరంగా పలు మార్పులు చేశారు. ఇందులో కొత్త Golden Bronze కలర్ ఆప్షన్‌ను అందించారు. అదనంగా స్కిడ్ ప్లేట్లు, సిల్ గార్నిష్పై బ్లాక్ ఫినిష్, రియర్ స్పాయిలర్, రూఫ్ రైల్స్, ORVMలు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో ప్రత్యేక Lounge సీటింగ్ డిజైన్, వాయిస్-ఎనేబుల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్, 11.6-అంగుళాల రియర్ సీట్ స్క్రీన్, అంబియంట్ లైటింగ్ వంటి సౌకర్యాలు అందించారు.
Alcazar ఇంజిన్
Alcazar Lounge Editionలో 1.5 లీటర్ U2 CRDi డీజిల్ ఇంజిన్ ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తున్నారు.
Alcazar Lounge Edition ధర
రూ.21.80 లక్షల నుంచి రూ.21.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).
Creta Electric Lounge Edition
Hyundai తన ఎలక్ట్రిక్ SUV Creta Electricకు కూడా Lounge Editionను తీసుకొచ్చింది. ఇది Long Range వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఈ వెర్షన్లో కొత్త Bronze కలర్ ఆప్షన్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్లు, బ్లాక్ సిల్ గార్నిష్, రియర్ స్పాయిలర్, రూఫ్ రైల్స్, ORVMలు వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా హోమ్ ఛార్జర్ ఆప్షన్, డ్యాష్‌క్యామ్, రియర్ వైర్లెస్ ఛార్జర్, 11.6-అంగుళాల రియర్ సీట్ స్క్రీన్, అంబియంట్ లైటింగ్ ప్రత్యేక Lounge సీట్ డిజైన్ వంటి ఫీచర్లు అందించారు.
Creta Electric Lounge Edition ధర
Creta Electric Lounge Edition ఎక్స్-షోరూమ్ ధర:
రూ.24.34 లక్షల నుంచి రూ.25.22 లక్షల వరకు.
తాజావార్తలు
-
Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
-
CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్‌లకు ప్రశంసలు..
-
AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
-
Asia Cup 2026 Final బెర్త్ ఎవరిది.? బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్ పోరుకు టీమిండియా రెడీ..!
-
Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో ‘సునీల్’.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?