Site icon NTV Telugu

లెవెల్ 2 ADAS, పానోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియమ్ ఫీచర్లతో కొత్త Hyundai Creta EV లాంచ్! ధర ఎంతంటే?

Hyundai Creta Ev

Hyundai Creta Ev

Hyundai Creta EV: హ్యుందాయ్ (Hyundai ) ఇదివరకు క్రెటా SUVకి King, King Knight, King Limited Editions విడుదల చేసిన తరువాత.. ఇప్పుడు తాజాగా క్రెటా ఎలక్ట్రిక్ లైన్‌ప్‌ను విస్తరించింది. ఇందులో ఎక్స్లెన్స్ Excellence (42 kWh), క్రెటా ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ టెక్ Creta Electric Executive Tech (42 kWh), క్రెటా ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ (O) Creta Electric Executive (O) (51.4 kWh) అనే మూడు కొత్త వెరియంట్లు లాంచ్ చేసింది. హ్యుందాయ్ ప్రకారం ఈ కొత్త వెరియంట్లు “ఆధునిక కస్టమర్ల మారుతున్న అవసరాలను తీర్చడానికి”గా రూపొందించబడ్డాయి.

ఇక ఇందులోని బ్యాటరీ అండ్ రేంజ్ విషయానికి వస్తే.. 42 kWh బ్యాటరీ ప్యాక్ (Excellence, Executive Tech) వేరియంట్లలో 420 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇక 51.4 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన Executive (O) వేరియంట్ 510 కి.మీ రేంజ్ అందిస్తుంది. అన్ని వెరియంట్లలో కూడా ఇప్పుడు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ Auto/Apple CarPlay సపోర్ట్ లభిస్తుంది. వీటితోపాటు, టాప్ వేరియంట్లలో డాష్‌క్యామ్, రియర్ వైర్‌లెస్ చార్జర్ కూడా ఉంటాయి.

తొలి 900W RMS సౌండ్‌బార్.. కొత్త Zebronics Juke Bar 9920 లాంచ్!

ఇక ఎక్స్లెన్స్ వెరియంట్లు Level 2 ADAS, డాష్‌క్యామ్, సరౌండ్ వ్యూ మానిటర్ (SVM), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్, రియర్ వైర్‌లెస్ చార్జర్, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ 8-వే డ్రైవర్ సీట్, లెదర్ సీట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఫోల్డబుల్ టేబుల్ విత్ డివైస్ హోల్డర్, రైన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ప్రీమియమ్ ఫీచర్లతో వస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ టెక్ (42 kWh) వెరియంట్‌లో వాయిస్-యాక్టివేటెడ్ పానోరమిక్ సన్‌రూఫ్, ఈకో-లెదర్ అపోల్స్టరీ, కూల్డ్ ఫ్రంట్ సీట్స్, రియర్ విండో సన్‌షేడ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇక ఎగ్జిక్యూటివ్ (O) (51.4 kWh) వెరియంట్‌లో ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ రేంజ్ తో పాటు.. ఇంటెలిజెంట్ పానోరమిక్ సన్‌రూఫ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉంటాయి. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కొత్త వెరియంట్లు విభిన్న ధరల్లో అందుబాటులోకి వచ్చాయి.

ఇందులో భాగంగా 42 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్లలో ఎగ్జిక్యూటివ్ మోడల్ ధర రూ.18,02,200 కాగా, ఎగ్జిక్యూటివ్ టెక్ రూ.18,99,900కి లభిస్తోంది. ప్రీమియం వెరియంట్ ధర రూ.19,99,900 కాగా, హోమ్ ఛార్జర్ (HC) ఆప్షన్‌తో వచ్చే ప్రీమియం (HC) రూ.20,72,900కి లభిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో అత్యంత ప్రీమియం వేరియంట్ అయిన ఎక్స్లెన్స్ ధర రూ.21,29,900, కాగా ఎక్స్లెన్స్ (HC) మోడల్ ధర రూ.22,02,900గా నిర్ణయించారు.

Stock Market: జీఎస్టీ ఊరటతో స్టాక్ మార్కెట్‌కు ఉత్సాహం.. భారీ లాభాల్లో సూచీలు

మరోవైపు, 51.4 kWh బ్యాటరీ ప్యాక్ వెరియంట్లలో, Executive (O) వెరియంట్ ధర రూ.19,99,900గా ఉంది. అదే సిరీస్‌లోని Smart(O) రూ.21,53,100కి లభిస్తుండగా, హోమ్ ఛార్జర్‌తో వచ్చే Smart(O) (HC) రూ.22,26,100కి అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్ అయిన ఎక్స్లెన్స్ ధర రూ.23,66,600గా ఉండగా, ఎక్స్లెన్స్ (HC) ధర రూ.24,39,600గా ఉంది. అంటే, కస్టమర్లు తమ బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా రూ.18 లక్షల నుంచి రూ.24.4 లక్షల వరకు విభిన్న ఆప్షన్లలో క్రెటా ఎలక్ట్రిక్‌ను ఎంచుకోవచ్చు. కొత్తగా హ్యుందాయ్ మ్యాట్ బ్లాక్, షాడో గ్రే అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లును కూడా తీసుకవచ్చింది.

Exit mobile version