అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో తమ ప్రొడక్ట్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ను అందిస్తోంది. కస్టమర్లను టెంప్ట్ చేసేలా బిగ్ డీల్స్ ను అందుబాటులో ఉంచుతోంది. స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అప్లియెన్సెస్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, వెహికల్స్, ఈవీలపై కళ్లు చెదిరే తగ్గింపును అందిస్తోంది. మీరు కొత్త బైక్ లను కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. టూవీలర్స్ పై రూ 15 వేల-20 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. హీరో, బజాజ్ కంపెనీలకు చెందిన బైక్స్ పై అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొంటే మీరు వేలల్లో లాభం పొందుతారు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా బజాజ్ పల్సర్ 125 డిస్క్ బైక్ ను రూ. 67,843కే సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే ఈ బైక్ పై రూ. 14 వేల తగ్గింపు లభిస్తోంది. Hero XTREME 125R బైక్ ను రూ. 77,795 కే అందుబాటులో ఉంది. ఈ బైక్ పై ఏకంగా రూ. 18,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ తో కొనుగోలు చేస్తే ఈ తగ్గింపు లభిస్తుంది. Hero PLEASURE స్కూటీ రూ. 60,263 ధరలో అందుబాటులో ఉంది. ఆల్ బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే రూ. 10,600 తగ్గింపు లభిస్తోంది.
మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నట్లైతే అమెజాన్ సేల్ లో హెచ్ డిలక్స్ బైక్ అందుబాటులో ఉంది. Hero HF Deluxe రూ. 51,198 కే వస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 9 వేలు తగ్గింపు పొందొచ్చు. Bajaj Chetak Electric స్కూటర్ ను రూ. 81,349కే కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 14,649 తగ్గింపు అందుకోవచ్చు. అమెజాన్ సేల్ లో బజాజ్, హీరో బ్రాండ్ కు చెందిన బైక్స్, స్కూటర్లపై బిగ్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. డీల్స్ ను వినియోగించుకుని మీ కలల బైక్ ను సొంతం చేసుకోండి.