Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda Rebel 500 Recall: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన ప్రీమియం క్రూయిజర్ బైక్ Rebel 500కు సంబంధించి రీకాల్ ప్రకటించింది. ఏప్రిల్ 2025 నుంచి ఆగస్టు 2025 మధ్య తయారైన 96 యూనిట్లను ఈ రీకాల్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ చర్య భారత్‌లోనే కాకుండా హోండా చేపట్టిన గ్లోబల్ రీకాల్ క్యాంపెయిన్‌లో భాగంగా ఉంది.
అసలు సమస్య ఏంటి?
హోండా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభావిత బైక్‌లలో హ్యాండిల్ లాక్కు అమర్చిన ఫిక్సింగ్ స్క్రూ అసెంబ్లీ సమయంలో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం బిగించబడకపోయి ఉండొచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఈ స్క్రూ కాలక్రమేణా వదులయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే స్టీరింగ్ కదలికపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా రీకాల్ చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ సమస్యకు సంబంధించి 2026 సెప్టెంబర్ 30 నాటికి భారత్‌లో ఎలాంటి ఘటనలు నమోదుకాలేదని హోండా పేర్కొంది. అయినప్పటికీ వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభావిత బైక్‌లలో హ్యాండిల్-లాక్ ఫిక్సింగ్ స్క్రూను ఉచితంగా మార్చనుంది. బైక్ వారంటీలో ఉన్నా లేకపోయినా ఈ రీకాల్ సర్వీస్ ఉచితంగానే అందించనుంది.
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
నవంబర్ నుంచి రీకాల్ సర్వీస్
ఈ రీకాల్ క్యాంపెయిన్ 2026 నవంబర్ మొదటి వారంలో అధీకృత హోండా BigWing డీలర్‌షిప్‌ల వద్ద ప్రారంభం కానుంది. ప్రభావిత బైక్‌ల యజమానులను హోండా ఫోన్ కాల్స్, SMS, ఇమెయిల్ ద్వారా సంప్రదించనుంది. డీలర్షిప్ యజమానులతో మాట్లాడి సర్వీస్ అపాయింట్మెంట్ను షెడ్యూల్ చేస్తుంది.
మీ బైక్ రీకాల్ పరిధిలో ఉందో ఇలా తెలుసుకోండి
మీ వద్ద Honda Rebel 500 ఉంటే.. మీ బైక్ ఈ రీకాల్ పరిధిలో ఉందో లేదో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం హోండా అధికారిక వెబ్‌సైట్‌లోని Recall Campaign విభాగంలోకి వెళ్లి మీ బైక్ 17 అంకెల VIN/Chassis Number నమోదు చేయాలి. బైక్ రీకాల్ పరిధిలో ఉంటే అక్కడ సమాచారం కనిపిస్తుంది. రీకాల్ పరిధిలో ఉన్న బైక్ యజమానులు సమీపంలోని Honda BigWing డీలర్‌షిప్‌ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవాలని కంపెనీ సూచిస్తోంది. ఈ రీకాల్‌లో భాగంగా చేయాల్సిన మార్పుకు ఎలాంటి ఛార్జీ ఉండదు.
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!