సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda QC3 Electric Scooter Launched: సిటీల్లో ఆఫీసులకు వెళ్లాలన్నా, మార్కెట్‌కు వెళ్లాలన్నా లేదా ఇంట్లో చిన్న చిన్న పనులకైనా ఇప్పుడు చాలామందికి ఎలక్ట్రిక్ స్కూటర్లే ఫస్ట్ ఛాయిస్ అయిపోయాయి. రోజురోజుకూ ఇవి బాగా పాపులర్ అవుతుండటంతో హోండా కంపెనీ కూడా ఫ్యామిలీస్ కోసం ప్రత్యేకంగా ‘Honda QC3’ పేరుతో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది ఇండియాలో హోండా నుంచి వచ్చిన మూడో ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర (న్యూ ఢిల్లీ) రూ.1,35,000గా ఉంది. ప్రస్తుతం దీన్ని ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లామ్ నగరాల్లోని సెలెక్టెడ్ హోండా రెడ్వింగ్ డీలర్‌షిప్‌లలో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. లాంచ్ చేసిన రోజు నుంచే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. రూ.5,000 అడ్వాన్స్ అమౌంట్ కట్టి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఇక పవర్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో 3.0 kWh బ్యాటరీ ఇచ్చారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 145 కిలోమీటర్ల దూరం (IDC సర్టిఫైడ్) ప్రయాణించవచ్చని కంపెనీ చెప్తోంది. ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్‌గానే అవుతుంది. కేవలం 2 గంటల 40 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. అలాగే పూర్తిగా 100 శాతం ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. దీన్ని కేవలం ఒక స్కూటర్‌లా కాకుండా, ఫ్యామిలీకి అన్ని రకాలుగా ఉపయోగపడేలా డిజైన్ చేశారు. ఇందులో 32 లీటర్ల పెద్ద స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, కాబట్టి రోజూ కావాల్సిన సామాన్లు లేదా బ్యాగులు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. రోజువారీ వాడకాన్ని మరింత ఈజీ చేయడానికి దీనికి స్మార్ట్ కీ (Smart Key) సదుపాయం కూడా ఇచ్చారు.
Also Read
- Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
- 32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
- Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
సాంకేతికత పరంగా చూస్తే.. ఇందులో 5 అంగుళాల TFT డిస్ప్లే ఉంటుంది. ఇది హోండా రోడ్‌సింక్ యాప్‌కి కనెక్ట్ అవుతుంది, కాబట్టి సిటీలో వెళ్లేటప్పుడు రూట్ సరిగ్గా తెలియకపోతే టర్న్-బై-టర్న్ నేవిగేషన్ చూస్తూ ఈజీగా ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ మ్యాట్ ఫాంటమ్ గ్రే మెటాలిక్, పర్ల్ ప్రీషియస్ వైట్, పర్ల్ షాలో బ్లూ, పర్ల్ సైరన్ బ్లూ అనే నాలుగు అట్రాక్టివ్ కలర్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం ఇది పైన చెప్పుకున్న ఐదు నగరాల్లోనే అందుబాటులో ఉన్నప్పటికీ, సిటీలో రోజువారీ వాడకానికి ఒక మంచి ఫ్యామిలీ ఈవీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
తాజావార్తలు
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!