Site icon NTV Telugu

కొత్త కలర్ ఆప్షన్లు, ప్రీమియమ్ ఇంటీరియర్‌తో మరింత స్టైలిష్‌గా వచ్చేసిన Honda Elevate 2025!

Elevate Honda

Elevate Honda

Honda Elevate 2025: హోండా కార్స్ ఇండియా (Honda Cars India) కంపెనీ తన ప్రీమియమ్ SUV ఎలివేట్ (Elevate)ను తాజా అప్‌డేట్స్‌తో అందుబాటులోకి తెచ్చింది. రాబోయే పండగ సీజన్‌కి ముందే ఈ అప్‌డేట్స్ ప్రకటించడం ద్వారా కస్టమర్లకు మరింత చేరువ చేసేలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పుల్లో కొత్త ఇంటీరియర్ థీమ్ ఆప్షన్లు, సీటు అప్‌డేట్‌లు, కొన్ని అదనపు ఫీచర్లు చోటు చేసుకున్నాయి.

ఈ కొత్త అప్డేటెడ్ కారులో ఎలివేట్ SUV ముందు భాగంలో ‘ఆల్ఫా-బోల్డ్ ప్లస్ గ్రిల్’ ను పరిచయం చేసింది హోండా. ఇది 9-స్లాట్ వెర్టికల్ డిజైన్‌తో, మందమైన క్రోమ్ బోర్డర్ కలిగిన స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ గ్రిల్ అన్ని ట్రిమ్‌లలో యాక్సెసరీగా లభిస్తుండగా, ‘సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్’ లో మాత్రం స్టాండర్డ్‌గా అందించబడింది. అబితేకాకుండా, కొత్త ‘క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ కలర్ ఆప్షన్’ ను కూడా తీసుకువచ్చారు. ఈ కలర్ ఇప్పుడు బేస్ SV పెట్రోల్-మాన్యువల్ తప్ప అన్నింటిలో లభిస్తుంది. ఈ కొత్త షేడ్ ధర, ప్లాటినం వైట్ పెర్ల్, ఆబ్సిడియన్ బ్లూ పెర్ల్‌ల మాదిరిగానే అదనంగా రూ. 8,000గా నిర్ణయించారు.

Kalvakuntla Kavitha: నాన్న నిర్ణయాన్ని శిరసావహిస్తుస్తా?.. ఏ పార్టీలో చేరను!

వీటితోపాటు క్యాబిన్‌లో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. టాప్-ఎండ్ ZX వెర్షన్‌లో కొత్త ‘ఐవరీ’ థీమ్ అందించబడింది. ఇందులో వైట్ లెదరెట్ సీట్లు, డాష్‌బోర్డ్ లతోపాటు డోర్ లైనర్లపై సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ ఉన్నాయి. దీంతో ఎలివేట్ ఇంటీరియర్‌లో ఇప్పుడు టాన్, బ్లాక్, ఐవరీ వంటి మూడు కలర్ ఆప్షన్లు లభిస్తున్నాయి.

ఇక ZX వేరియంట్ లో 360-డిగ్రీ కెమెరా, 7-కలర్ ఆంబియంట్ లైటింగ్ మాత్రం ఆప్షనల్ గానే కొనసాగుతున్నాయి. ఇక మధ్యస్థాయి V, VX వేరియంట్స్ లో ఇచ్చిన షాడో బేజ్ ఫాబ్రిక్ అప్‌హోల్స్టరీని తొలగించి, దాని స్థానంలో బ్లాక్ ఫాబ్రిక్ సీట్లు, వైట్ సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, డోర్ లైనర్లు అందించబడ్డాయి. అలాగే, సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ లో ఇప్పుడు 7-కలర్ ఆంబియంట్ లైటింగ్ స్టాండర్డ్‌గా లభిస్తోంది.

అటు ఫీచర్లు, ఇటు సేఫ్టీతో కొత్త Maruti Suzuki Victoris సంచలనం.. 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌తో పాటు!

అయితే మెకానికల్ మార్పులు మాత్రం చోటు చేసుకోలేదు. 2025 ఎలివేట్ ఇప్పటికీ అదే 1.5 లీటర్, 4-సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇది 121 హెచ్‌పి పవర్, 145 Nm టార్క్ ను ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ లభిస్తున్నాయి. ఇక ధర విషయానికి వస్తే, ఎలివేట్ ఇప్పటికీ రూ. 11.91 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధర వద్దే అందుబాటులో ఉంది. మొత్తంగా, కొత్త కలర్స్, ఇంటీరియర్ థీమ్‌లు, అదనపు ఫీచర్లతో ‘హోండా ఎలివేట్’ ఇప్పుడు మరింత ప్రీమియమ్ టచ్ అందిస్తూ, పండగ సీజన్‌లో SUV కొనాలనుకునే కస్టమర్లను ఆకర్షించడానికి సిద్ధమైంది.

Exit mobile version