భారత్‌లో టూ వీలర్ సెగ్మెంట్లో యాక్టివాకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. హోండా టూ వీలర్ మోడల్స్‌లో బెస్ట్ సెల్లింగ్‌గా దూసుకెళ్తోంది . కస్టమర్ల ఆసక్తి, అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు.. యాక్టివాను అప్డేట్ చేస్తూ వస్తోంది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). ఈ క్రమంలోనే హోండా యాక్టివా 6జీ లేటెస్ట్ వెర్షన్.. హోండా యాక్టివా హెచ్- స్మార్ట్‌ను లాంచ్ చేసింది. మొత్తానికి ఈ స్కూటర్లో మూడు వేరియంట్స్ ఉంటాయి. అవి.. స్టాండర్డ్, డీలక్స్, స్మార్ట్. వీటి ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ. 74,536- రూ. 77,036- రూ. 80,537. హోండాకు మాత్రమే సొంతమైన ఐదు సరికొత్త టెక్నాలజీ అప్లికేషన్స్ ఈ స్కూటర్లో ఉంటాయని తెలుస్తోంది.
Samosa and Tea: మన సమోసా, టీకి యూకేలో ఇంత డిమాండ్ ఉందా..? షేర్ చేసిన వైసీపీ ఎంపీ
ఈ స్కూటర్‌కు ఓ స్మార్ట్ కీ ఉంటుందని, అది ప్రెస్ చేస్తే.. వెహికిల్ రెస్పాండ్ అయ్యే విధంగా స్మార్ట్ ఫైండ్ ఫీచర్ ఈ యాక్టివా హెచ్- స్మార్ట్‌లో ఉందని హెచ్ఎంఎస్ఐ చెబుతోంది. ఫిజికల్ కీ లేకుండానే.. స్మార్ట్ కీతో స్కూటర్‌ను లాక్, అన్‌లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంది. 2 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు.. స్మార్ట్ కీ ప్రెస్ చేస్తే.. స్కూటర్ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ ఫీచర్ కూడా స్కూటర్‌కు ఇచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఈ హోండా యాక్టివా 6జీ లేటెస్ట్ వర్షెన్.. యాక్టివా హెచ్- స్మార్ట్‌లో వీల్‌బేస్, ఫుట్‌బోర్డ్ ఏరియా పెద్దగా ఉన్నాయి. న్యూ పాసింగ్ స్విచ్, డీసీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ అదనపు ఆకర్షణలు. 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను కొత్తగా డిజైన్ చేశారు. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, అడ్జస్టెబుల్ రేర్ సస్పెన్షన్ వంటివి కూడా ఉన్నాయి. ఈ కొత్త హోండా యాక్టివాలో 110 సీసీ పీజీఎం-ఎఫ్ ఇంజిన్ ఉంటుంది. లీనియర్ పవర్‌ను జనరేట్ చేసే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ (ఈఎస్పీ) కూడా ఉంది. ఎన్హాన్స్డ్ స్మార్ట్ టంబుల్ టెక్నాలజీ, ఏసీజీ స్టార్ట్ అండ్ ఫ్రిక్షన్ రిడక్షన్ వంటి టెక్నాలజీలను యాక్టివా హెచ్- స్మార్ట్‌కు ఇచ్చింది హోండా సంస్థ.