Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Splendor+ Price Hike: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus) ఒకటి. మూడు దశాబ్దాలకు పైగా ద్విచక్ర వాహనదారుల ఆదరణ పొందుతున్న ఈ బైక్ ధరలను హీరో మోటోకార్ప్ తాజాగా పెంచింది. స్ప్లెండర్ ప్లస్ శ్రేణిలోని అన్ని వేరియంట్లపై ధరల పెంపును ప్రకటించింది. గరిష్ఠంగా ఒక వేరియంట్‌పై రూ.3,086 వరకు ధర పెరిగింది.
హీరో స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ మోడల్ డ్రమ్, ఐ3ఎస్ (i3S), స్పెషల్ ఎడిషన్స్, 125 మిలియన్ ఎడిషన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో స్పెషల్ ఎడిషన్స్పై అత్యధికంగా రూ.3,086 ధర పెరిగింది. మిగిలిన వేరియంట్ల ధరలు రూ.1,135 చొప్పున పెరిగాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ డ్రమ్ వేరియంట్ ధర గతంలో రూ.77,777 ఉండగా.. ప్రస్తుతం రూ.78,912కు పెరిగింది. అంటే రూ.1,135 పెరిగింది. ఇక i3S వేరియంట్ ధర రూ.78,910 నుంచి రూ.80,045కు చేరింది. అలాగే స్పెషల్ ఎడిషన్స్ ధర రూ.78,580 నుంచి రూ.81,666కు పెరిగింది. ఈ వేరియంట్‌పై అత్యధికంగా రూ.3,086 పెంపు విధించారు. ఇక 125 మిలియన్ ఎడిషన్ ధర రూ.80,531 నుంచి రూ.81,666కు చేరగా, దీనిపై రూ.1,135 పెరిగింది.
Also Read
- New Bajaj Pulsar RS200: కొత్త Bajaj Pulsar RS200 లాంచ్.. Google Maps, TFT డిస్ప్లేతో క్రేజీ ఫీచర్స్.. ధర ఎంతంటే?
- TVS Star City Plus: స్ల్పెండర్కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్‌కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!
- Volkswagen T-Roc R: 328HP పవర్‌తో Volkswagen T-Roc R SUV.. 250kmph టాప్ స్పీడ్‌తో అదరగొట్టే ఫీచర్లు!
- BMW R 12 G/S: రూ.25.40 లక్షలతో BMW కొత్త బైక్ లాంచ్.. 1170cc ఇంజిన్, 109hp పవర్, ఆఫ్‌రోడ్ ఫీచర్లు!
ఇక గతంలో బ్లాక్, యాక్సెంట్ పేర్లతో అందుబాటులో ఉన్న వేరియంట్లను కంపెనీ ఇప్పుడు స్పెషల్ ఎడిషన్స్గా పేరు మార్చింది. వీటిలో మ్యాట్ గ్రే, మ్యాట్ వెర్నియర్ గ్రే, క్యాండీ బ్లేజింగ్ రెడ్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్లను అందిస్తోంది. స్టాండర్డ్ మోడల్లోని నాలుగు వేరియంట్లకు ముందు, వెనుక రెండు వైపులా డ్రమ్ బ్రేకులనే ఇచ్చారు. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ (XTEC) మోడల్లో మాత్రమే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇందులో అనలాగ్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా డిజిటల్ డిస్ప్లేపై రియల్ టైమ్ మైలేజీ వివరాలను కూడా చూడవచ్చు. ఈ మోడల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.82,418 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.85,461గా ఉంది.
ఈ శ్రేణిలో టాప్-ఎండ్ మోడల్ అయిన స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, హజార్డ్ లైట్లు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ మోడల్ కేవలం ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. దీని కొత్త ధరను కంపెనీ రూ.84,549గా నిర్ణయించింది. మరోవైపు హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ (Flex) మోడల్ ధరను కూడా కంపెనీ పెంచింది. గతంలో రూ.82,710గా ఉన్న ఈ బైక్ ధర ప్రస్తుతం రూ.84,042కు చేరింది. అంటే రూ.1,332 పెరిగింది. ఇటీవల హీరో మోటోకార్ప్ సీఈఓ హర్షవర్ధన్ చితాలే స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ మోడళ్లకు సంబంధించి 15,000 యూనిట్ల డిస్పాచ్‌లను ప్రకటించారు. ఈ ఫ్లెక్స్ మోడల్ E85 ఇంధనంపై 8.6hp పవర్, 8.3Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. E20 వెర్షన్‌తో పోలిస్తే ఇది 7 శాతం అధిక పవర్, 3 శాతం అధిక టార్క్‌ను అందిస్తుంది. అయితే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ బైక్ ఇప్పటికీ రూ.72,792 ప్రారంభ ధరతోనే అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Hardik Pandya Trade: హార్దిక్‌ను ఎందుకు తీసుకున్నామంటే.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UNEXPECTED – SAFED SACH: దేశాన్ని కుదిపేసిన డెహ్రాడూన్ బస్సు ఘటనపై సినిమా
-
Telugu Movie Piracy: టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ఒకే వెబ్సైట్లో 4 కొత్త సినిమాలు లీక్..
-
AI Data Centre Row: విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీ పన్నులు!.. అమెరికా టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!