Hero Vida Dirt.E K3: హీరో మోటోకార్ప్‌కు చెందిన Vida బ్రాండ్ భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మరో ప్రత్యేకంగా అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో మంచి మార్కెట్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు మొదటిసారిగా పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్- Vida Dirt.E K3 ను విడుదల చేయడానికి సిద్ధమైంది. 4 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం రూపొందించిన ఈ బైక్ డిసెంబర్ 12న అధికారికంగా విక్రయాలకు అందుబాటులోకి రానుంది.
అయితే, ఈ బైక్‌ను తొలిసారి ఈ ఏడాది జరిగిన EICMA ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించగా, అప్పటి నుంచే ఇది ఆటో ప్రియుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బైక్ డిజైన్‌లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది పిల్లల వయస్సు, శరీర హావభావాలకు అనుగుణంగా మార్చుకునే విధంగా రూపొందించబడింది. వీల్‌బేస్, రైడింగ్ హైట్, సస్పెన్షన్ వంటి ఫీచర్లను మార్చుకునే అవకాశం ఉంది. పైగా, ఈ బైక్‌లో Small, Medium, High అనే 3 సస్పెన్షన్ సెట్టింగ్‌లు అందుబాటులోకి తెచ్చింది. ఇవి పిల్లల రైడింగ్ స్థాయికి అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు.
Read Also: Samantha : మళ్ళి పెళ్లి చేసుకున్న సమంత.. వరుడు ఎవరంటే?
ఇక, పని తీరులో కూడా ఈ డర్ట్ బైక్ అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇందులో 360 Wh రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, 500W ఎలక్ట్రిక్ మోటర్ అమర్చబడ్డాయి. బైక్ గరిష్ట వేగం 25 kmph గా పరిమితం చేయడం ద్వారా పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అంతేకాకుండా, ఈ బైక్ ఆధునిక భద్రతా టెక్నాలజీతో రాబోతుంది. ప్రత్యేకమైన మొబైల్ యాప్ సపోర్ట్ ద్వారా తల్లితండ్రులు తమ పిల్లల రైడింగ్‌ను మానిటర్ చేయడానికి అవకాశం ఉంది. స్పీడ్ కంట్రోల్, రైడింగ్ ట్రాకింగ్ లాంటి సేఫ్టీ ఆప్షన్లు ఇందులో ఉంటాయి.
కాగా, రైడింగ్ అనుభవాల కోసం ఈ బైక్‌లో Low, Mid, High అనే మూడు రైడింగ్ మోడ్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటి గరిష్ట వేగాలు వరుసగా 8 kmph, 14 kmph, 25 kmph కి పరిమితం చేశారు. ఇప్పటికే తన ప్రత్యేకమైన డిజైన్ Red Dot Award 2025 పురస్కారాన్ని సొంతం చేసుకుంది. మొత్తం మీద Vida Dirt.E K3 పిల్లలకు వినోదంతో పాటు సేఫ్టీ, టెక్నాలజీ కలిగిన కొత్త రైడింగ్ అనుభవాన్ని అందించబోతుంది. పర్యావరణ హితమైన రవాణా దిశగా ఇది మరొక విప్లవాత్మక ముందడుగు అని చెప్పొచ్చు.
