Site icon NTV Telugu

GST ఎఫెక్ట్.. రూ.95,500 వరకు తగ్గిన Honda కార్ల ధరలు..!

Honda (1)

Honda (1)

Honda Cars: ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హోండా (Honda Cars India Ltd. (HCIL)) GST రిఫార్మ్స్ 2025 ద్వారా వచ్చిన పూర్తిగా లాభాలను తమ కస్టమర్లకు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానున్నాయి. వినియోగదారులు ఇప్పుడు తమ ప్రియమైన హోండా కార్లు బుక్ చేసుకుంటే, GST తగ్గింపు ధరలతో పాటు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆకర్షణీయమైన ఫెస్టివ్ ఆఫర్లను పొందవచ్చు. ఈ కార్లను నవరాత్రి ప్రారంభం నుండి డెలివరీ పొందవచ్చు.

ADAS ఫీచర్లతో పాటు ప్రీమియం లుక్‌ను అందించే ఫీచర్లతో వచ్చేసిన Tata Nexon.ev!

ఇందుకు సంబంధించి కంపెనీ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. కొత్తగా ప్రకటించిన GST రిఫార్మ్స్ 2025 ఆటో ఇండస్ట్రీకి వచ్చిన మంచి నిర్ణయం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త ధర మార్పులు కస్టమర్లకు వాహనాలను మరింత సులభంగా అందించడంతో పాటు, ఫెస్టివ్ సీజన్ డిమాండ్‌ను పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వినియోగదారులు నవరాత్రి సమయానికే డెలివరీ పొందేందుకు ఇప్పుడు నుంచే బుకింగ్ చేసుకొనేలా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన అన్నారు.

కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలనేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న Honda వాహనాల ధరలు!

కంపెనీ ప్రకారం కొత్త GST రిఫార్మ్స్ 2025 అమలులోకి వచ్చే తేదీ నుండి కొన్ని ప్రముఖ మోడల్స్‌పై ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా, హోండా అమేజ్ 2nd జెన్ మోడల్‌కి రూ. 72,800 వరకు తగ్గింపు, హోండా అమేజ్ 3rd జెన్ కి రూ. 95,500 వరకు తగ్గింపు లభించనుంది. వీటితోపాటు హోండా ఎలేవేట్ మోడల్‌పై రూ. 58,400 వరకు తగ్గింపు, హోండా సిటీ మోడల్‌కి రూ. 57,500 వరకు తగ్గనున్నట్లు సంస్థ తెలిపింది. కాబట్టి వినియోగదారులు తమకు సమీపంలోని హోండా డీలర్షిప్‌ను సంప్రదించి ప్రతి మోడల్ కొత్త ధరల జాబితా, ఫెస్టివ్ ఆఫర్ల వివరాలు పొందొచ్చు.

Exit mobile version