GST Council meeting 2025: సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ విధానాలు ఆటో రంగంలో కీలక మార్పులో చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే తాజాగా జరిగిన GST కౌన్సిల్ మీటింగ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చిన్న కార్లు, 350cc లోపల ఇంజిన్ సామర్థ్యం గల మోటార్‌సైకిళ్లపై జీఎస్టీ 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా బస్సులు, ట్రక్కులు, అంబులెన్సులు వంటి కమర్షియల్ వాహనాలపై కూడా జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించారు. ఆటో పార్ట్స్‌పై కూడా HS కోడ్ ఆధారంగా వేర్వేరు పన్నులు ఉండే వ్యవస్థను తొలగించి, అన్ని ఆటో పార్ట్స్‌పై 18 శాతం జీఎస్టీని తీసుకొచ్చారు. ఈ లిస్ట్ లోకే మూడు చక్రాల వాహనాలు కూడా తీసుకువచ్చారు.
లెవెల్ 2 ADAS, పానోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియమ్ ఫీచర్లతో కొత్త Hyundai Creta EV లాంచ్! ధర ఎంతంటే?
ఇక విలాసవంతమైన వాహనాల విభాగానికి వేరే విధానం కొనసాగనుంది. మధ్యస్థాయి, లగ్జరీ కార్లు, 350cc కి పైబడిన బైక్‌లు, హెలికాప్టర్లు, విమానాలు, యాచ్టులు, స్పోర్ట్స్ వాహనాలు వంటి వాటిపై 40 శాతం జీఎస్టీ పన్ను అమలు చేయనున్నారు. కొత్త పన్ను విధానం కారణంగా రెండు జీఎస్టీ స్లాబ్‌లతో స్పష్టత వస్తుందని, వాహనాలపై ఇంతకు ముందు అమలు చేస్తున్న సెస్స్‌ను కూడా తొలగించారని మంత్రి వెల్లడించారు.
దీనితో పండుగ సీజన్‌కి ముందే ఈ మార్పులు అమలులోకి వస్తుండటంతో వాహనాల కొనుగోలుదారులకు ఊరట లభించనుంది. అంతేకాకుండా గత త్రైమాసికంలో నెమ్మదించిన ఆటో రంగం అమ్మకాలకు ఇది పెద్ద ఊతాన్ని కలిగించే అవకాశముంది. మొత్తంగా రాబోయే కాలంలో అనేక వాహనాల ధరలు తగ్గవచ్చని చెప్పవచ్చు.
