Citroen e-C3 electric hatchback: ఇండియాలో ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో మార్కెట్ రారాజుగా ఉంది టాటా. టాటా వరసగా తన ఈవీ మోడళ్లను విడుదల చేస్తోంది. ఈవీ సెగ్మెంట్ లో టాటాను తట్టుకునేందుకు ఇతర కంపెనీలు కూడా తమ ఈవీ కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీలను తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పోలో హారియర్ ఈవీని తీసుకువచ్చి ఆందర్ని ఆశ్చర్యపరిచింది.
ఇదిలా ఉంటే ఫ్రాన్స్ ఆటోమోబైల్ దిగ్గజం సిట్రియోన్ భారత్ లో తొలి ఈవీని తీసుకురాబోతోంది. ఇది ఈ కంపెనీ నుంచి వచ్చే మూడో కారు. సిట్రోయెన్ e-C3 పేరుతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి పెట్రోల్, డిజిల్ ఆధారిత సీ5, సీ3 మోడల్ కార్లు ఇండియన్ మార్కెట్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సిట్రోయెన్ e-C3 కారు హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో రానుంది. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో ఇప్పటికే టాటా టియాగో ఈవీని తీసుకువచ్చింది. సిట్రోయెన్ e-C3 రాకతో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఈవీ జోరు పెరగనుంది.
Read Also: Microsoft Layoffs: 10,000 మంది ఉద్యోగాలు ఊస్ట్.. ప్రకటించిన మైక్రోసాఫ్ట్
సిట్రోయెన్ e-C3 ప్రత్యేకతలు, ధర వివరాలు:
సిట్రోయెన్ e-C3 ధర రూ. 8 లక్షల నుండి రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చని అంచనా. ఇ-సి3 బుకింగ్‌లు జనవరి 22న ప్రారంభమవుతుండగా, వచ్చే నెలలో దీన్ని లాంచ్ చేయనున్నారు. పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్, 29.3 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. గరిష్టంగా 57 పీఎస్ పవర్ తో 143 న్యూటన్ మీటర్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కార్ స్టాండర్డ్, ఎకో డ్రైవ్ మోడ్లతో వస్తోంది. కేవలం 6.8 సెకన్లలో గంటకు 0-60 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకుంటుంది. గరిష్టంగా 107kmph వేగాన్ని అందుకోగలదు.
29.2kWh లిథియం-అయాన్ ఎయిర్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. సిట్రోయెన్ బ్యాటరీపై ఏడేళ్లు/ 1,40,000 కిలోమీటర్ల వారంటీని, మోటార్ పై ఐదేళ్లు/ 1,00,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. మొత్తంగా ఎలక్ట్రిక్ మోడల్ కు మూడేళ్లు/1,25,000 కిలోమీటర్ల వారంటీ ఇవ్వనుంది. సిట్రోయెన్ e-C3 పొడవు 3,981mm, వెడల్పు 1,733mm మరియు ఎత్తు 1,604mmలతో పాటు 2,540mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. 315 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉండనుంది.
15A ప్లగ్ పాయింట్‌ని ఉపయోగించి బ్యాటరీని 10 గంటల 30 నిమిషాల్లో 10-100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జర్‌తో, 10-80% బ్యాటరీని కేవలం 57 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేయవచ్చు.