Citroen Aircross Comfort Edition: సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల.. ప్రీమియం ఫీచర్లు, ధర ఎంతంటే?

  • సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల
  • ప్రారంభ ధర రూ. 9.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • ఇంటీరియర్‌లో ప్రీమియం టచ్
Citroen Aircross

Citroen Aircross

ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ Citroen భారత మార్కెట్లో తన ప్రముఖ SUV అయిన Citroen Aircross కంఫర్ట్ ఎడిషన్‌ను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించారు. ఇంటీరియర్‌లో పలు ప్రీమియం అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్లు, అదనపు యాక్సెసరీ ప్యాకేజీలతో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది.

ధర ఎంత?

సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 9.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. బేస్-స్పెక్ ‘యూ’ (You) వేరియంట్‌పై అదనంగా రూ.20,000 చెల్లిస్తే ఈ కంఫర్ట్ ఎడిషన్‌ను కొనుగోలు చేయవచ్చు.

×
×
Ad

ఇంటీరియర్‌లో ప్రీమియం టచ్

ఈ కొత్త ఎడిషన్‌లో మెట్రోపాలిటన్ బేజ్ లెదర్ అప్ హిల్స్టరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ముందు, వెనుక సీట్లకు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లను అందించారు. అలాగే క్యాబిన్‌లో బ్లాక్ గ్రాండే సాఫ్ట్-టచ్ ఫినిషింగ్‌ను ఉపయోగించడం ద్వారా మరింత ప్రీమియం అనుభూతిని కల్పించారు.

అదనపు యాక్సెసరీ ప్యాక్‌లు

యూ వేరియంట్‌తో అదనంగా రూ.36,000 చెల్లించి కస్టమర్లు ప్రత్యేక యాక్సెసరీ ప్యాక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో:

10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
వైర్‌లెస్ Apple CarPlay, Android Auto
రివర్స్ పార్కింగ్ కెమెరా
ఫాగ్ ల్యాంప్స్
క్రోమ్ ఇన్సర్ట్‌లతో డోర్ క్లాడింగ్
ఫుల్ వీల్ కవర్లు
స్టైలింగ్ అప్‌గ్రేడ్‌లు వంటి ఫీచర్లు లభిస్తాయి.

ప్లస్-మ్యాక్స్ ప్యాక్‌లో మరిన్ని సౌకర్యాలు

అదనంగా రూ.8,460 చెల్లిస్తే వైర్‌లెస్ ఛార్జర్, మరికొన్ని స్టైలింగ్ ఎలిమెంట్లను జోడించుకోవచ్చు.

టాప్-స్పెక్ మ్యాక్స్ ప్యాక్ కోసం అదనంగా రూ.40,000 చెల్లిస్తే:

JBL ప్రీమియం ఆడియో సిస్టమ్
క్యాబిన్ రిఫ్రెష్ సిస్టమ్
రియర్ డ్యాష్‌క్యామ్ వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

భద్రతకు ప్రాధాన్యం

ఈ ఎడిషన్‌లో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక ఆడియో హెచ్చరిక వ్యవస్థను కూడా అందించారు. ఇందులో:

ఫ్రంట్ కొలిజన్ అలర్ట్
లేన్ చేంజ్ వార్నింగ్
పెడెస్ట్రియన్ కొలిజన్ అలర్ట్
వెహికల్ అహెడ్ స్టార్ట్ నోటిఫికేషన్
వెహికల్ డిస్టెన్స్ అలర్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.