Citroen Aircross Comfort Edition: సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల.. ప్రీమియం ఫీచర్లు, ధర ఎంతంటే?
- సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల
- ప్రారంభ ధర రూ. 9.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- ఇంటీరియర్‌లో ప్రీమియం టచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ Citroen భారత మార్కెట్లో తన ప్రముఖ SUV అయిన Citroen Aircross కంఫర్ట్ ఎడిషన్‌ను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించారు. ఇంటీరియర్‌లో పలు ప్రీమియం అప్డేట్లు, కొత్త ఫీచర్లు, అదనపు యాక్సెసరీ ప్యాకేజీలతో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది.
ధర ఎంత?
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 9.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. బేస్-స్పెక్ ‘యూ’ (You) వేరియంట్‌పై అదనంగా రూ.20,000 చెల్లిస్తే ఈ కంఫర్ట్ ఎడిషన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Also Read
- BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
- Royal Enfield Classic 650 Hypershift: రాయల్ ఎన్ఫీల్డ్ Classic 650 Hypershift ఎడిషన్ లాంచ్.. 648cc ఇంజిన్, ధర ఎంతంటే?!
- TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ఇంటీరియర్‌లో ప్రీమియం టచ్
ఈ కొత్త ఎడిషన్‌లో మెట్రోపాలిటన్ బేజ్ లెదర్ అప్ హిల్స్టరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ముందు, వెనుక సీట్లకు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లను అందించారు. అలాగే క్యాబిన్లో బ్లాక్ గ్రాండే సాఫ్ట్-టచ్ ఫినిషింగ్‌ను ఉపయోగించడం ద్వారా మరింత ప్రీమియం అనుభూతిని కల్పించారు.
అదనపు యాక్సెసరీ ప్యాక్‌లు
యూ వేరియంట్‌తో అదనంగా రూ.36,000 చెల్లించి కస్టమర్లు ప్రత్యేక యాక్సెసరీ ప్యాక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో:
10 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
వైర్లెస్ Apple CarPlay, Android Auto
రివర్స్ పార్కింగ్ కెమెరా
ఫాగ్ ల్యాంప్స్
క్రోమ్ ఇన్సర్ట్లతో డోర్ క్లాడింగ్
ఫుల్ వీల్ కవర్లు
స్టైలింగ్ అప్గ్రేడ్లు వంటి ఫీచర్లు లభిస్తాయి.
ప్లస్-మ్యాక్స్ ప్యాక్‌లో మరిన్ని సౌకర్యాలు
అదనంగా రూ.8,460 చెల్లిస్తే వైర్లెస్ ఛార్జర్, మరికొన్ని స్టైలింగ్ ఎలిమెంట్లను జోడించుకోవచ్చు.
టాప్-స్పెక్ మ్యాక్స్ ప్యాక్ కోసం అదనంగా రూ.40,000 చెల్లిస్తే:
JBL ప్రీమియం ఆడియో సిస్టమ్
క్యాబిన్ రిఫ్రెష్ సిస్టమ్
రియర్ డ్యాష్‌క్యామ్ వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
భద్రతకు ప్రాధాన్యం
ఈ ఎడిషన్‌లో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక ఆడియో హెచ్చరిక వ్యవస్థను కూడా అందించారు. ఇందులో:
ఫ్రంట్ కొలిజన్ అలర్ట్
లేన్ చేంజ్ వార్నింగ్
పెడెస్ట్రియన్ కొలిజన్ అలర్ట్
వెహికల్ అహెడ్ స్టార్ట్ నోటిఫికేషన్
వెహికల్ డిస్టెన్స్ అలర్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!