Cheap and Best Mileage Electric Scooters In India 2023: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడమే. పెట్రో భారాన్ని తగ్గించుకునేందుకు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తునారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. సామాన్య ప్రజలకు కూడా వీటి ధరలు అందుబాటులో ఉండడంతో.. అమ్మకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ కారణంగా మూడు హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు (Best Hero Electric Scooters in India) జనాదరణ పొందాయి. ఆ జాబితాను ఓసారి చూద్దాం.
Hero Eddy Price:
హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 72000. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వబడింది. ఇది స్కూటర్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఫైండ్ మై బైక్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా మీరు స్కూటర్ పార్కింగ్ ప్రదేశాన్ని తెలుసుకోవచ్చు. ఇది రివర్స్ మోడ్‌ను కలిగి ఉంది. దీని ద్వారా స్కూటర్‌ను సులభంగా రివర్స్ చేయవచ్చు.టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఛార్జింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ కోసం యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఫుల్ ఛార్జ్‌పై 85 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది.
Also Read: PAK Replacement CWC 2023: ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ ఆడకుంటే.. ఆ జట్టుకు అవకాశం!
Hero Electric Optima CX Price:
ఆప్టిమా సీఎక్స్ స్కూటర్ ధర రూ. 67000. స్కూటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. పోర్టబుల్ బ్యాటరీ. దీని కారణంగా ఇంట్లో లేదా కార్యాలయంలో ఛార్జ్ చేయడం చాలా సులభం. స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, రిమోట్ లాక్ మరియు యాంటీ థెఫ్ట్ అలారం సౌకర్యం ఉంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇవ్వబడింది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, యూఎస్బీ పోర్ట్ మరియు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు. పూర్తి ఛార్జ్‌తో 82 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.
Hero Electric Flash LX Price:
ఫ్లాష్ఎల్ఎక్స్ స్కూటర్ ధర సుమారు రూ. 59000. ఇది కంపెనీ యొక్క చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది రెడ్ అండ్ వైట్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. పోర్టబుల్ బ్యాటరీ, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, యూఎస్బీ పోర్ట్ మరియు అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. పూర్తి ఛార్జ్‌తో 85 కిలోమీటర్ల ప్రయాణం అందిస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది.
Also Read: Team India Captain: టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు!