NTV Telugu Site icon

Budget Cars in India 2023: 5 లక్షల కంటే తక్కువ ధర.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే మూడు కార్లు ఇవే!

Renault Kwid

Renault Kwid

Budget Cars in India 2023: ఈ రోజుల్లో కారు కొనడం చాలా మందికి ఓ కల. తక్కువ సంపాదించే వారు కూడా ఈఎంఐ చెల్లించి కారును కొనుగోలు చేస్తారు. ఒకేసారి మొత్తం చెల్లింపు చేయడానికి బదులుగా.. ఫైనాన్స్ చేస్తారు. అప్పుడు కాస్త ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మీరు కూడా కారు కొనడానికి సిద్ధంగా ఉన్నట్లయితే.. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మంచి కార్లు ఉన్నాయి. ఈఎంఐ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బెస్ట్ మైలేజీ వల్ల నెలకు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఈ కార్ల ప్రారంభ ధర 5 లక్షల కంటే తక్కువ (ఎక్స్ షోరూమ్). ఈ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

Renault Kwid:
రెనాల్ట్ క్విడ్ కారును కొనుగోలు చేస్తే తక్కువ బడ్జెట్‌లో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4 లక్షల 69 వేలు. దీని ఫీచర్లు మరియు లుక్స్ అద్భుతమైనవి. రెనాల్ట్ క్విడ్ కారు మైలేజీ లీటరుకు 22 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

Also Read: Marnus Labuschagne Catch: మార్నస్ లబుషేన్‌ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన హ్యారీ బ్రూక్! వైరల్ వీడియో

Maruti Suzuki S-Presso:
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోను రూ. 5 లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు లుక్ మరియు ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. 5 సీట్ ఫ్యామిలీ కారు ధర రూ. 4.26 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్ ధర) ప్రారంభమవుతుంది. ఎస్-ప్రెస్సో మైలేజ్ 25.3 కిమీగా ఉంది. ఈ కారులో పెట్రోల్ మరియు సీఎన్జీ ఎంపికలు ఉన్నాయి.

Maruti Suzuki Alto K10:
మారుతి సుజుకి ఆల్టో కె10 గతేడాది విడుదలైంది. శక్తివంతమైన ఇంజన్ మరియు పవర్‌తో పాటు అనేక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఆల్టో కె10 ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర). ఈ కారు మైలేజ్ లీటరుకు 24.9 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మీ వద్ద కాస్త ఎక్కువ డబ్బు ఉంటే.. సీఎన్జీ మోడల్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. దీని మైలేజీ మరింత ఎక్కువగా ఉంటుంది.

Also Read: Nokia G42 5G Smartphone: నోకియా నుంచి చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్.. మొబైల్ మార్కెట్‌లో సంచలనమే ఇక!

Show comments