Site icon NTV Telugu

Bajaj Chetak Premium: బజాజ్ చేతక్ అప్‌డేట్ వెర్షన్ త్వరలో లాంచ్.. ఫీచర్స్, ధర?

Bajaj Chethak

Bajaj Chethak

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ కంపెనీ తాజాగా మరో బైకును మార్కెట్ లోకి తీసుకురానుంది.. బజాబ్ చేతక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకప్పుడు ఈ స్కూటర్ కారణంగా బజాజ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ద్విచక్ర వాహన రంగాన్ని ఇది ఏలింది. త్వరలో చేతక్‌కు అప్‌డేట్ వెర్షన్ రానుంది. ‘బజాజ్ చేతక్ ప్రీమియం’.. ఈ స్కూటర్ అప్డేట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

ఈ బైక్ ఫీచర్స్, స్పెసిఫికెషన్స్..

గతంలో వచ్చిన చేతక్ మోడల్‌లో 2.88 kWh బ్యాటరీ ఉంటే, రాబోయే చేతక్ ప్రీమియంలో శక్తివంతమైన 3.2 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. అప్ కమింగ్ యూనిట్ కస్టమర్‌లకు మెరుగైన రేంజ్‌ను అందించవచ్చు. ఐడీసీ క్లెయిమ్ చేసిన విధంగా ఇది 127 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉంది.. ఈ బైక్ చార్జింగ్ చెయ్యడానికి నాలుగున్నర గంటలు పడుతుంది.. ఇకపోతే గంటకు 73 కిమీ వేగాన్ని అదిస్తుందని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్స్‌గా చేతక్ ప్రీమియంలో బ్లూటూత్‌తో కనెక్ట్ అయిన TFT డాష్‌బోర్డ్ ఉండవచ్చు..

ఇతర ఫీచర్స్ ను చూస్తే.. ప్రతి మలుపులోనూ కస్టమర్‌లకు సహాయంగా పనిచేస్తుంది. మలుపుల వద్ద ప్రమాదాలు జరగటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే రైడర్‌ను అలర్ట్ చేయడానికి కంపెనీ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక రిమోట్ లాక్, అన్‌లాక్ సిస్టమ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్, స్పీడ్ లిమిట్ సెన్సార్స్ మొదలగు ఫీచర్స్ ను కలిగి ఉంది..

ధర..

ఈ బజాజ్ చేతక్ ప్రీమియం ధర రూ.1.20 లక్షలు ఉండొచ్చు… స్టోరేజీ కెపాసిటీ విషయానికి వస్తే, అండర్-సీట్ కంపార్ట్‌మెంట్ 21 లీటర్ల వరకు లోడ్ అవుతుందని చెబుతున్నారు..

Exit mobile version