ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో కొత్త కొత్త బైకులను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. 2024 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1,15,001 ప్రారంభ ధరతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.. టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా వి1, ఓలా ఎస్1 బైకులకు పోటీగా వస్తుంది.. ఈ ఏడాది చేతక్ అర్బేన్, ప్రీమియం అనే రెండు వేరియంట్‌లను కలిగి ఉంది. చేతక్ అర్బేన్ కోర్సన్ గ్రే, సైబర్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్, ఇండిగో మెటాలిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండగా, చేతక్ ప్రీమియం హాజెల్‌నట్, ఇండిగో మెటాలిక్ బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్ కలర్ ఆప్షన్లను కలిగి ఉంది.. ఈ బైకు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ బైకులను 2020 లో ప్రారంభించినప్పటికి ఇప్పటికి అన్ని పూర్తి చేసి మార్కెట్ లోకి విడుదల కాబోతున్నాయి.. మార్కెట్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లక్షకన్నా ఎక్కువ యూనిట్లను విక్రయించింది.. ఇప్పుడు అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్ లోకి రానుంది.. ఈ కొత్త బైకు గంటకు 73కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. చేతక్ ప్రీమియం ఆన్‌బోర్డ్ 800డబ్ల్యూ ఛార్జర్‌తో వస్తుంది. కొత్త చేతక్ మునుపటిలాగే ఆల్-మెటల్ బాడీని కలిగి ఉంది. అన్ని ఎలక్ట్రికల్ భాగాలతో ఐపీ67-రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. పెద్ద బూట్ కూడా కలిగి ఉంది..
5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను కలిగి ఉంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ మేనేజ్‌మెంట్ ముఖ్యంగా హిల్ హోల్డ్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్లను అందిస్తూ అదనపు టెక్‌ప్యాక్‌తో పొందవచ్చు.. అలాగే రివర్స్ మోడ్ ను కూడా కలిగి ఉంటుంది.. ఇక చేతక్ ప్రీమియమ్‌లో సీక్వెన్షియల్ రియర్ బ్లింకర్లు, సెల్ఫ్ క్యాన్సిలింగ్ బ్లింకర్లు, ఎడమ, కుడి కంట్రోల్ స్విచ్‌లు, ఎలక్ట్రానిక్ హ్యాండిల్, స్టీరింగ్ లాక్‌లు, సీట్ స్విచ్‌లు, హెల్మెట్ బాక్స్ ల్యాంప్ ఉన్నాయి. బజాజ్ ఆటో చేతక్‌కి ‘గ్రీన్ స్కోర్’ని అందిస్తుంది. రైడర్‌లు వారి కార్బన్ ఫూట్‌ఫ్రింట్ రిడెక్షన్, ఇంధన వినియోగం తగ్గింపు, ద్రవ్య ఆదాను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది.. ఈ స్కూటర్ ధర విషయానికొస్తే.. వేరియంట్ ను బట్టి ధర కూడా మారుతుందని చెబుతున్నారు.. 2024 బజాజ్ చేతక్ అర్బనే ధర రూ.1,15,001, అలాగే 2024 బజాజ్ చేతక్ ప్రీమియం రూ. 1,35,463 గా ఉంది..