Tesla: భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టెస్లా.. ముంబైలో తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్..
- భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టెస్లా..
- ముంబైలో తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్..
- జూలై 15న ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla: భారతదేశంలోకి ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. జూలై 15న భారత్‌లో తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని ముంబైలో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా భారత మార్కెట్‌లోకి టెస్లా అధికారికంగా ప్రవేశించబోతోంది. ముంబైలోని ప్రముఖ వ్యాపార జిల్లా అయిన అప్‌స్కేల్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ఉన్న షోరూంలో సందర్శకుల కోసం టెస్లా ఎలక్ట్రిక్ కార్లు, దాని టెక్నాలజీని తెలుసుకునేందుకు అవకాశం అందిస్తోంది. అయితే, టెస్ట్ డ్రైవ్, వాహన డెలివరీలు అందుబాటులో ఉండదని భావిస్తున్నారు.
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
- Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
లాంచ్‌కు ముందు టెస్లా దాదాపు 1 మిలియన్ డాలర్ల విలువైన వాహనాలు, సూపర్ చార్జర్లు, ఇతర పరికరాలను భారతదేశంలోకి దిగుమతి చేసింది. ఇవి ప్రధానంగా, అమెరికా, చైనా నుంచి వచ్చాయి. దిగుమతి అయిన వాటిలో టెస్లా ప్రముఖ మోడల్ Y SUV ఆరు యూనిట్లు ఉన్నాయి. అయితే, భారత్‌లో తయారీ చేసేందుకు టెస్లా ప్రస్తుతానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దిగుమతి చేసుకున్న వాటినే అమ్మేందుకు ఇష్టపడుతోందని ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.
ప్రస్తుతం టెస్లాకు దేశంలో నాలుగు కమర్షియల్ సైట్లు ఉన్నాయి. వీటిలో కొత్త ముంబై షోరూమ్, కుర్లా వెస్ట్‌లో ఒక సర్వీస్ సెంటర్, పూణేలో ఒక ఇంజనీరింగ్ హబ్, బెంగళూరులో దాని రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్నాయి. ప్రపంచ డిమాండ్ మందగించడం, అదనపు ఉత్పత్తి సామర్థ్యంతో టెస్లా ఇబ్బంది పడుతున్నందున భారతదేశంలో ప్రారంభించాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!