Ampere Rio VYB: ఆంపియర్ రియో VYB ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. లైసెన్స్ అవసరం లేదు, ఒక్క ఛార్జ్‌తో 80KM రేంజ్!
- రియో VYB (Rio VYB) స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల
- ఒక్క ఛార్జ్‌తో 8KM రేంజ్!
- ధర భారత మార్కెట్లో రూ.69,499 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ ఆంపియర్ భారత మార్కెట్లో తన కొత్త రియో VYB (Rio VYB) స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదా RTO రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం ప్రత్యేకత. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వారికి ఈ మోడల్ అనుకూలంగా ఉంటుంది.
ధర ఎంత?
ఆంపియర్ రియో VYB ధర భారత మార్కెట్లో రూ.69,499 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇదే సిరీస్‌లోని రియో 80 మోడల్ ధర రూ.60,650 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రియో VYB ఈ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం స్లో-స్పీడ్ స్కూటర్‌గా మార్కెట్లోకి వచ్చింది.
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
- Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
ఆకర్షణీయమైన డిజైన్, నాలుగు రంగులు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది:
వార్మ్ వైట్
పాస్టెల్ పర్పుల్
డార్క్ గ్రే
ఆక్వా మెటాలిక్
స్టెప్-త్రూ డిజైన్‌తో వచ్చిన ఈ స్కూటర్ ముందు భాగంలో LED DRLsతో కూడిన హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. అలాగే సైడ్ బాడీ ప్యానెల్స్‌పై యాంబియంట్ లైటింగ్‌ను అందించడం ఈ ధర విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
బ్యాటరీ, రేంజ్
ఆంపియర్ రియో VYBలో 1.44kWh LFP (లిథియం ఫెర్రో ఫాస్ఫేట్) బ్యాటరీని ఉపయోగించారు. ఈ బ్యాటరీతో స్కూటర్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వెనుక చక్రంలో అమర్చిన హబ్ మోటార్ 0.25kW పవర్, 35Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 5 గంటల 30 నిమిషాలు పడుతుంది.
ఫీచర్లు
ఆంపియర్ రియో VYBలో పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి:
రివర్స్ మోడ్
పూర్తి LED లైటింగ్
LCD డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
కీలెస్ గో సిస్టమ్
ప్రీమియం కీ ఫాబ్
మెయిన్ స్టాండ్
24 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్
బ్రేకింగ్ మరియు వీల్స్
స్కూటర్ ముందు భాగంలో 12 అంగుళాల అల్లాయ్ వీల్‌తో పాటు డిస్క్ బ్రేక్‌ను అందించారు. వెనుక భాగంలో 10 అంగుళాల వీల్‌ను అమర్చారు. తక్కువ నిర్వహణ ఖర్చు, లైసెన్స్ అవసరం లేకపోవడం, మంచి రేంజ్, ఆకర్షణీయమైన ఫీచర్లతో ఆంపియర్ రియో VYB నగర ప్రయాణాలకు సరైన ఎంపికగా నిలవనుంది.
తాజావార్తలు
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..