కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 Yezdi: యెజ్దీ (Yezdi) నుండి 2026 మోడల్ రేంజ్ ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త లైనప్‌లో యెజ్దీ అడ్వెంచర్, రోడ్‌స్టర్, స్క్రాంబ్లర్ (Yezdi Adventure, Roadster, Scrambler) మోడళ్లకు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. ముఖ్యంగా Yezdi Adventureలో తొలిసారిగా ట్యూబ్‌లెస్ క్రాస్ స్పోక్ వీల్స్ ను అందించారు. కేరళలో ఓణం పండుగ సందర్భంగా ఈ కొత్త రేంజ్‌ను కంపెనీ విడుదల చేసింది.
తొలిసారి ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్:
2026 Yezdi Adventureలో కొత్తగా యెల్లో ఫాల్కన్ (Yellow Falcon) కలర్‌ను తీసుకవచ్చారు. ఈ వేరియంట్లో ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్ ఉన్నాయి. సంప్రదాయ స్పోక్ వీల్స్ బలం, ట్యూబ్‌లెస్ టైర్ల సౌలభ్యాన్ని కలిపి ఈ సెటప్‌ను రూపొందించారు. ఈ ఫీచర్ కోసం స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే రూ.20,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే టోర్నడో బ్లాక్, గ్లాస్ వైట్, నెబ్యులా బ్లూ కలర్ ఆప్షన్లలో కూడా ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో ఇప్పటికే ఉన్న 334cc లిక్విడ్-కూల్డ్ Alpha2 ఇంజిన్నే కొనసాగించారు. ఈ ఇంజిన్ 29.2 bhp పవర్, 29.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, Road, Rain, Off-road అనే మూడు ABS మోడ్లు కూడా ఉన్నాయి.
Also Read
- 505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
- TVS Raider Doctor Doom Edition: మార్వెల్ డాక్టర్ డూమ్ స్ఫూర్తితో టీవీఎస్ కొత్త బైక్.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
- Ather Pothole+ Alerts: ఏథర్ స్కూటర్లకు కీలక అప్డేట్.. గుంతలు, స్పీడ్ బంప్లపై ముందే అలర్ట్! ఎలా పనిచేస్తుందంటే?
మరోవైపు Yezdi Roadsterకు కొత్త గ్రీన్ మాంబా (Green Mamba) కలర్‌ను కొత్తగా లాంచ్ చేశారు. మ్యాట్ గ్రీన్ ఫినిష్‌తో పాటు Arabica Brown క్విల్టెడ్ సీట్, కాపర్ డెకల్స్తో ఇది మరింత బాగా కనిపిస్తుంది. ఇందులో 334cc Alpha2 ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ కొనసాగుతున్నాయి. ఇక Yezdi Scramblerకు గ్రే పాంథర్ (Grey Panther) కలర్‌ను తీసుకొచ్చారు. ఇందులో మెటాలిక్ గ్రే పెయింట్, బ్రౌన్ రిబ్డ్ సీట్, మ్యాచింగ్ ట్యాంక్ ప్యాడ్స్ ఉన్నాయి. ఈ బైక్‌లో 334cc KATAR లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉండగా.. ఇది 29.5 bhp పవర్, 30 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం ఇది లీటర్‌కు 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
2026 Yezdi మోడళ్ల ధరలు:
* Yezdi Adventure Yellow Falcon (ట్యూబ్‌లెస్) – రూ.2,32,969
* Yezdi Adventure Tornado Black / Gloss White / Nebula Blue (ట్యూబ్‌లెస్) – రూ.2,29,969
* Yezdi Adventure Yellow Falcon (స్టాండర్డ్) – రూ.2,12,969
* Yezdi Roadster Green Mamba – రూ.2,05,969
* Yezdi Scrambler Grey Panther – రూ.2,05,969
2026 Yezdi Adventure, Roadster, Scrambler బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ లాంచ్‌తో పాటు Classic Legends కేరళలో ఒకేసారి 20 కొత్త టచ్ పాయింట్లను ప్రారంభించింది. కంపెనీ లక్ష్యం 2028 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 700 టచ్ పాయింట్లకు తన నెట్‌వర్క్‌ను పెంచుకోవడమే.
తాజావార్తలు
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
-
Shehzad Poonawalla: బీజేపీకి షాజాద్ పూనావాలా రాజీనామా..
-
Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్
-
Rega Kantha Rao: “పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్‌బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!