Site icon NTV Telugu

కొత్త డిజైన్‌తో మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకడ్ గా రాబోతున్న 2026 KTM 790 Duke..

2026 Ktm 790 Duke

2026 Ktm 790 Duke

2026 KTM 790 Duke: మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకడ్ సెగ్మెంట్‌లో పేరొందిన KTM 790 Duke మోడల్‌కు కంపెనీ అప్‌డేట్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో ఫైల్ చేసిన టైప్-అప్రూవల్ డాక్యుమెంట్స్ ద్వారా 2026 KTM 790 Duke గురించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి.

Viral Smile Boy: జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క నవ్వు.. ఇంతకీ ఆ వైరల్ కుర్రాడు ఎవరంటే!

ఈ కొత్త 2026 KTM 790 Dukeలో ప్రధాన మార్పులు డిజైన్‌లో కనిపించనున్నాయి. కొత్త మోడల్‌లో 990 Duke, 1390 Super Duke R మోడళ్లకు సమానమైన హెడ్‌లైట్ స్టైల్‌ను ఉపయోగించారు. మధ్యలో LED హెడ్‌లైట్, రెండు వైపులా DRLs ఉండేలా డిజైన్ చేశారు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్, ట్యాంక్ ష్రౌడ్స్ మరింత బాగా కనిపిస్తున్నాయి. బైక్‌ లో కొత్త సబ్‌ ఫ్రేమ్ కూడా ఇవ్వబడింది. యూరప్‌ లో కనిపించిన స్పై షాట్స్ ప్రకారం ఈ మోడల్‌లో పూర్తిగా రీడిజైన్ చేసిన ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉండనుంది.

NED vs NAM: పాకిస్థాన్ను వెనక్కి నెట్టిన నెదర్లాండ్స్! నమీబియాపై ఘన విజయం..

ఈ అప్‌డేట్‌లో మెకానికల్ మార్పులు పెద్దగా ఉండవని తెలుస్తోంది. బైక్‌లో ఇప్పటికే ఉన్న 799cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్నే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారు 95hp పవర్, 87Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఈ కొత్త మోడల్‌లో KTM-బాడ్జ్డ్ J.Juan బ్రేక్ కాలిపర్స్ స్థానంలో WP బ్రేక్ కాలిపర్స్ ఇవ్వనున్నారు. అయితే బ్రేక్ డిస్కులు లేదా ABS సిస్టమ్‌లో మార్పులు ఉంటాయా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికే ఉన్న WP సస్పెన్షన్, స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ కొనసాగనున్నాయి. అయితే ఈ కొత్త మోడల్ ఏ దేశాల్లో విడుదల అవుతుందో, భారత్ మార్కెట్‌కు తిరిగి వస్తుందా లేదా అన్న విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Exit mobile version